YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రిటైరవుతున్న రాని ఉద్యోగాలు

రిటైరవుతున్న రాని ఉద్యోగాలు

చెన్నై, జూన్ 28,
అగ్నిపథ్‌పై విభిన్న ప్రచారాలు జరుగుతున్నా.. మాజీ సైనికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ప్రైవేట్ సెక్టార్‌లో కూడా ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులను తీసుకోవడం లేదు. దేశ వ్యాప్తంగా ఈ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ప్రస్తుతం అగ్నిపథ్‌ను బీజేపీ మినహా.. మిగతా పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యతిరేకత, నిరసనలు ఎలా ఉన్నా.. దేశంలోని 33 రాష్ట్రాలు (యూటీ)లతో కలుపుకుని 5.69 లక్షల మంది ఆర్మీ మాజీ సైనికులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే.. అందులో కేవలం 14,165 మందికి మాత్రమే ఎంప్లాయిమెంట్ లభించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మాజీ సైనికులకు ప్రత్యేక కోటా ఉన్నా.. దాన్ని నింపడం లేదు. ఆ కోటాలో ఉద్యోగాలను నియమించడం లేదని స్పష్టమవుతోంది.దేశవ్యాప్తంగా మాజీ సైనికులు 26.75 లక్షల మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఆర్మీ అధికారులు ఇటీవల రాష్ట్రాల వారీగా తీసిన అధికారిక సమాచారం ప్రకారం మాజీ సైనికులు 23.15 లక్షల వరకు ఉంటే.. ఆర్మీలో వివిధ విభాగాల్లో పని చేసి, పదవీ విరమణ పొందినవారు మరో 3.60 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు.ప్రస్తుతానికి రిటైరైన వారిలో 21 లక్షల మంది 33 నుంచి 37 ఏండ్లలోపు ఉన్నవారేనని తెలుస్తోంది. వీరిలో వివిధ రాష్ట్రాల్లో 5.69 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఆర్మీలో పదవీ విరమణ పొందిన తర్వాత ప్రస్తుతం వారికి సగటున రూ.18 వేల నుంచి రూ.30 వేలలోపు పెన్షన్ వస్తుందని ఆర్మీ మాజీలు చెప్తున్నారు. మేజర్, ఆపై స్థాయిలో ఉన్నవారికి మాత్రం రూ.30 నుంచి రూ.48 వేల వరకు పెన్షన్ రూపంలో జమ అవుతోంది. దీంతో చాలామంది మాజీ సైనికుల కోటాలో పని చేసేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆర్మీ నుంచి వచ్చే పెన్షన్‌తో బతుకలేకపోతున్నామంటూ ఉద్యోగాల వేటలో పడ్డారు. కానీ, వారికి ఎంప్లాయ్మెంట్ దూరంగానే ఉంది. ఇప్పుడు ఆర్మీ మాజీల కోటాలో ఉన్న దరఖాస్తులు దేశ వ్యాప్తంగా 5.69 లక్షలుగా ఉంటే.. తెలంగాణలో 5792 మంది ఉన్నారు. వీరంతా ప్రభుత్వ ఉద్యోగాలకు అన్ని రకాల అర్హతలున్న వారే. కానీ, రాష్ట్రంలో.. దేశంలో ఏండ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేకపోవడం, వచ్చిన వాటిలో అవకాశం రావడం లేదు. అంతేకాకుండా దేశంలో ఆర్మీలో పని చేసి రిటైరైన వారిలో 21 లక్షల మంది వరకు 35 ఏండ్లలోపు వారున్నారు. తెలంగాణలో దాదాపు 8 వేల మంది ఉన్నారు. కానీ, ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు రాకపోవడంతో.. ప్రైవేట్‌గా దొరికిన ఉద్యోగం చేస్తున్నారు. అత్యధికంగా సెక్యూరిటీ గార్డులుగా కొనసాగుతున్నట్లు అంచనా వేస్తున్నారు.కొన్నేండ్ల నుంచి రూపుదిద్దుకున్న అగ్నిపథ్ఇప్పుడు ఆర్మీ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో పలు రాష్ట్రాల్లో నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. రైళ్లను తగులబెట్టారు. దీనిలో కుట్ర కుణాలు, రెచ్చగొట్టడం ఎలా ఉన్నా.. ఆర్మీ మాజీ ఉద్యోగుల ఉద్యోగావకాశాలను పరిశీలిస్తే అగ్నిపథ్‌పై ఆందోళనలకు బలం చేకూర్చుతున్నాయి. ఎందుకంటే కేవలం నాలుగేండ్ల సర్వీసు తర్వాత మాజీ సైనికులు అనే కోటా కోసం ఎదురుచూస్తారు. అంతేకాకుండా ఆర్మీ రిటైర్డ్స్ పెరుగుతారు. వేలల్లో ఉన్న సంఖ్య లక్షల్లోకి చేరుతోంది. దీంతో ఆర్మీ మాజీలుగా ఉండే లక్షల మంది ఉపాధి అవకాశాలు కష్టమవుతాయి. స్వయం ఉపాధి కూడా ఇబ్బందులే తెచ్చిపెట్టనుంది. రిటైర్మెంట్బెనిఫిట్స్కింద రూ.11 లక్షలు ఇస్తామన్నా.. వాటితో సంపూర్ణంగా వ్యాపారాలు చేయరు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. అంతేకాకుండా బ్యాంకుల్లో రుణాలు కూడా ఇవ్వడం కష్టమే. ఇప్పటికే రిటైరవుతున్నవారికీ ఉపాధి లేదు. ఇలాంటి సమయంలో లక్షల మంది మాజీ సైనికులకు ఎంప్లాయిమెంట్ దొరకడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts