ముంబై, జూన్ 28,
మహారాష్ట్ర రాజధాని ముంబై నాయక్‌నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందిని రెస్క్యూ చేసి కాపాడినట్లు అధికారులు తెలిపారు. భవనం కూలిన సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని కాపాడారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న 8మందిని రక్షించారు. ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలించామని.. ప్రస్తుతం చికిత్స అందుతుందని అధికారులు తెలిపారు. అయితే, శిథిలాల కింద 20 నుంచి 25 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో భవనం కుప్పకూలగా వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు బీఎంసీ అధికారులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ఆశిష్ కుమార్ పేర్కొన్నారు.