YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రివర్గం ఫస్ట్ బ్యాచే బెటరా..?

మంత్రివర్గం ఫస్ట్ బ్యాచే బెటరా..?

విజయవాడ, జూన్ 29,
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో సభ్యులు ఉన్నారా? లేదా? అన్న అనుమానం కలుగుతుంది. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణను రెండు సార్లు చేశారు. మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా వెళ్లిపోవడంతో ఒకసారి విస్తరణ చేశారు. తర్వాత ఇటీవల పూర్తిగా మంత్రివర్గాన్ని విస్తరించారు. పాత మంత్రులు కొందరు ఉన్నా కొత్తవారికి ఎక్కువ సంఖ్యలో అవకాశం కల్పించారు. అయితే జగన్ మంత్రివర్గంలో ఫస్ట్ బ్యాచ్ బెస్ట్ అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టడంలో పాత మంత్రులే బెస్ట్ అని చెప్పక తప్పదు. తొలి మంత్రి వర్గంలో కొడాలి నాని, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మంత్రులు యాక్టివ్ గా ఉన్నారు. విపక్షాల విమర్శలను వెంటనే తిప్పి కొట్టేవారు. కానీ రెండో బ్యాచ్ లో వచ్చిన మంత్రులు పెద్దగా యాక్టివ్ గా లేరన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కేవలం అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా వంటి వారే ఎక్కువగా ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. మున్సిపల్ శాఖ నుంచి విద్యాశాఖ తీసుకున్న తర్వాత బొత్స సత్యనారాయణ కూడా పెద్దయాక్టివ్ గా లేరు. మిగిలిన మంత్రులు తమ శాఖకే పరిమితమయ్యారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. పార్టీలో చర్చ.. పార్టీ పరంగా కూడా ఇది చర్చనీయాంశమైంది. ప్రభుత్వం తరుపున వాయిస్ వినిపించే వారు తక్కువయ్యారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎక్కువ మంది మంత్రులు తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు. జగన్ తన మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించినా సరైన ప్రచారం లేక అనేక పథకాలు ప్రజలకు చేరువ కావడం లేదు. దీంతో మొదటి బ్యాచ్ లోనే మంత్రులు యాక్టివ్ గా ఉండేవారంటున్నారు. తొలివిడతలో మంత్రులుగా పనిచేసిన వారిని కేబినెట్ నుంచి తొలగించడంతో వారు కూడా ఇన్ ‍యాక్టివ్ అయ్యారు. వారు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. దీంతో ఫస్ట్ బ్యాచ్ బెస్ట్ అని... సెకండ్ బ్యాచ్ వేస్ట్ అన్న కామెంట్స్ పార్టీలోనే వినడుతున్నాయి.

Related Posts