విజయవాడ, జూన్ 29,
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నిటిలోకి, ‘అమ్మఒడి’ అత్యంత ప్రతిష్టాత్మక పథకం...అలాగని ప్రభుత్వమే ప్రచారం చేసుకుంటోంది. న భూతో న భవిష్యతి, ఇలాటింటి పథకం ఇంతవరకు లేదు ఇక ముందు ఉండదు, అని వైసీపీ సర్కార్ ఫుల్ పేజీ ప్రకటనలతో ... ప్రచారం సాగించింది. అయితే, ఇప్పడు, అదే అమ్మఒడి పథకాన్ని, గుదిబండ పథకంగా భావిస్తోందా ? ఎదో ఒక సాగుతో, ‘అమ్మఒడి’ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోందా? అంటే, ప్రభుత్వ వర్గాల నుంచే అవుననే సమాధానం వస్తోంది. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా అభివృద్ధిని పక్కన పెట్టి, అప్పులు చేసిమరీ,సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. సంక్షేమ పథకాలే తమను మళ్ళీ మళ్ళీ అందలం ఎక్కిస్తాయనే భ్రమల్లో వైసీపే నేతలు తెలిపోతుంటారు. సంస్ఖేం లెక్కలు ఆ పార్టీ నాయకులు గొప్పగా చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి అయితే, మీటలే మన ఓట్లు... వచ్చే ఎన్నికలలో 175 సెట్లు మనవే అనే ధీమా వ్యక్త చేసారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అదుపు తప్పిన అవినీతి కారణంగా మూడేళ్ళు గడించే సరికి సర్కార్ ఖజానా ఖాళీ అయింది. దీంతో, ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని, ఒక్కొక్క సాకుతో నీరు గార్చే పనిలో పడింది. చివరకు, దుల్హన్ వంటి కొన్ని పథకాలకు ఔర్తిగానే మంగళ పాడేశారు. అందులో భాగంగా అమ్మఒడి పథకాన్ని అంచల వారీగా అటకెక్కించడం ఖాయని, ప్రభుత్వ అధికారులే అనుమనాలు వ్యక్తపరుస్తున్నాఋ. కొవిడ్ సాకుగా చూపి ఒక సంవత్సరం, పథకాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత, 75 శాతం హాజరు నిబంధన పేరుతో ‘అమ్మ ఒడి’ నిధులను 50 వేల మందికి ఎగ్గొట్టారు. ఇక ఇప్పడు అమ్మఒడిలో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్ ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. బహిరంగ మార్కెట్‌లో ల్యాప్‌టాప్ ధరలు పెరిగాయని పంపిణీ నిలిపివేస్తున్నామని చావు కబురు చల్లగా చెప్పింది. నిజానికి, ఒక విధంగా పిల్లలకు ల్యాప్‌టాప్’లు ఇవ్వడం వలన, కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే, ప్రభుత్వం ఆర్థిక భారానికి వెరసి వెనకడుగు వేసింది.నిజానికి ఒక్క అమ్మఒడి పథకమే కాదు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సంక్షేమా పథకాలు ప్రకటించడంలో ఎంత దూకుడు చూపారో, ఇప్పడు ఒక్కొక్క పథకానికి కోతలు పెట్టడంలోనూ, అంతకంటే ఎక్కువ దూకుడు చూపుతున్నారు.ఒంటరి మహిళలకు పింఛను ఇచ్చే వయసును 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించారు. ఇలా మొత్తానికి జగన్ రెడ్డి ప్రభుత్వం, మూడేళ్ళలో రాష్ట్రాన్ని, ఓ వంక అప్పుల ఉబిలో చేర్చింది. మరి వంక సక్షేమ పథకాలకు చెల్లు చీటీ ఇచ్చింది. అందుకే, ప్రజలు ఒక్క ఛాన్స్ సీఎంను ఎంత త్వరగా సగానంపుదామా అని, ఎదురు చూస్తున్నారు.