విజయవాడ, జూన్ 29,
జగన్ వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నానని చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా ఆయన చేసేది అంతా జగన్మాయ మాత్రమే. అమ్మ ఒడి అన్నారు. తీరా లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేశారు. ఒంటరి మహిళలకు పింఛన్ అన్నారు. అమలులోకి వచ్చే సరికి వయస్సు నిబంధనతో లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా కుదించారు. ఇలా ఏ పథకం తీసుకున్నా.. ఏ సంక్షేమం తీసుకున్నా అదే తీరు, అదే రీతి. దుల్హన్ పథకం దగ్గరకు వచ్చే సరికి గత ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహానికి రూ. 50 వేలు ఇచ్చింది...తాను అధికారంలోకి వస్తే లక్ష ఇస్తానని గత ఎన్నికలకు ముందు జగన్ వాగ్దానం చేశారు. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పడు నిధుల కొరత సాకు చూపుతూ ఆ పథకానికే మంగళం పాడేశారు.తాజాగా ఆర్టీసీ విలీనం విషయంలోనే జగన్ మాట తప్పారు. మడమ కూడా తిప్పేశారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైసీపీ ప్రకటించింది. జగన్ సీఎం అయిన తర్వాత సాంకేతిక సమస్యలు ఉన్నాయని కేవలం ఉద్యోగుల్ని మాత్రమే ప్రజా రవాణా శాఖ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి విలీనం చేసింది. ఆర్టీసీ మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా ఆర్టీసీ మొత్తాన్ని లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది. మళ్లీ లీజు ఏమిటి? ప్రభుత్వంలో విలీనం చేయొచ్చు కదా అంటే మాత్రం సాంకేతిక సమస్యలంటూ నీళ్లు నములుతోంది జగన్ ప్రభుత్వం. అంతే కానీ ఆ సాంకేతిక సమస్యలేమిటన్నది మాత్రం చెపపడం లేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా లీజు వ్యవహారాన్ని తెరైకి తీసుకు వచ్చి పూర్తి చేయడానికి తొందరపడుతోంది. అయితే అదేమీ ఆర్టీసీ మీద ప్రేమతో కాదు.. కేంద్రానికి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేకుండా తప్పించుకోవడానికేనని అంటున్నారుఆర్థిక రంగ నిపుణులు. వారికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. కానీ వారు పని చేస్తోంది మాత్రం వేరే సంస్థగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీలోనే. అంటే ఆర్టీసీ ప్రభుత్వోద్యోగులుగా మారిన తమ పాత ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోందన్నమాట. అందుకు గానూ జీఎస్టీ చెల్లించాలి. ఈ జీఎస్టీని చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ లీజు అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. అయితే ఇక్కడో రహస్యం ఉంది.ఆర్టీసీని విలీనం చేసుకుంటే ఈ లీజు గొడవ ఉండదుకదా అంటే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే.. ఆర్టీసీ అప్పుల భారం కూడా ప్రభుత్వానికి విలీనం అయిపోతుంది. అదంతా ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. అలాగే ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. అంటే విలీనానికి కేంద్రం అంగీకరించాలి. అలా కేంద్రం అంగీకారం తెలిపితే మొదట కేంద్రం చేసే పని తన వాటాను ఉపసంహరించుకోవడం. అదీ ప్రభుత్వానికి ఆర్థిక భారమే అవుతుంది. అందుకే ఈ బేడదలు.. కాదు కాదు బాధ్యతలేమీ తీసుకోకుండా లీజుతో సరిపెట్టేయాలని జగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది.