YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏబీవీపై ఇంకానా...

ఏబీవీపై ఇంకానా...

విజయవాడ, జూన్ 29,
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై మరోసారి సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రస్తుతం ఏపీ ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి సీఎస్‌ సమీర్‌ శర్మ సస్పెండ్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో గూఢచర్యం చేశారని ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారు వెంకటేశ్వరరావు. అప్పటి నుంచి తన పోస్టింగ్ కోసం పోరాటం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆయనపై సస్పెన్షన్ ఎత్తేసిన జగన్ సర్కార్.. సర్వీస్ ను మాత్రం చాలా కాలం పాటు పెండింగ్ లో పెట్టింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చింది.కాగా 2022 మే 19న సాధారణ పరిపాలనశాఖకు ఏబీవీ రిపోర్టు చేశారు. దీంతో ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జి.విజయ్‌కుమార్‌ను రిలీవ్‌ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో ఏబీవీని నియమించింది. అయితే తాజాగా మరోసారి ఏబీవీని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Related Posts