YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

క్రాస్ రోడ్స్ లో ఎర్రజెండాలు

క్రాస్ రోడ్స్ లో ఎర్రజెండాలు

విజయవాడ, జూలై 5,
ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాల పరిస్థితి ఎటూ కాకుండా ఉంది. ఇటు ప్రజల్లో పరపతి పడిపోయింది. మరోవైపు పొత్తులతో వెళదామనుకున్నా చివరి క్షణంలో ఏమవుతుందో అర్థంకాని పరిస్థితి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఒక్క చోట కూడా గెలుపు సాధ్యం కాలేదు. కొత్త రాష్ట్రంలో దశాబ్దకాలం పాటు శాసనసభలో ప్రాతినిధ్యం లభించలేదు. ప్రాంతీయ పార్టీలకు కొన్ని దశాబ్దాలుగా తోక పార్టీలుగా మారిపోయాయి. ఈసారి ఎన్నికల్లో కనీసం కొన్ని స్థానాల్లోనైనా గెలిచేందుకు వామపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సీపీఐ ఒక అడుగు ముందుకేసి 2019 ఎన్నికల తర్వాత నుంచి టీడీపీతో తిరుగుతోంది. టీడీపీతో కలిస్తే ఈసారి సులువుగా ఎమ్మెల్యే స్థానాలను ఒకటి రెండింటినైనా గెలుచుకోవచ్చని ఆశపడుతుంది. అందుకే ఆ పార్టీ నేతలు ప్రతిపక్ష టీడీపీతో కలిసి పోరాటం చేస్తున్నారు. చివరి క్షణంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం వీరి ఆశలు అడియాసలయినట్లే. సీపీఎం కూడా టీడీపీతో అంత అంటకాగకపోయినా కొంత అనుకూలంగా వ్యవహరి  అధికార వైసీపీ ఎటూ దరి చేరనివ్వదు. ఇక జనసేన ఒంటరిగా పోటీ చేసినా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటున్నారు. గతంలో మాదిరి వామపక్షాలకు ప్రజల్లో బలం లేదు. వారికి ఒకప్పుడు కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు కూడా చేజారి పోయాయి. ఎర్రజెండాలు అక్కడక్కడా కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో గెలుపొందగల బలమైన ఓటు బ్యాంకు లేదు. దీంతో వామపక్షాలను ఏ పార్టీ దరిచేరనివ్వని పరిస్థిితి నెలకొంది. వామపక్షాలకు ఒక్క టీడీపీయే దిక్కుగా మారనుంది. అదీ ఈసారి చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తేనే వీలవుతుంది. అందులో కూడా చంద్రబాబు వారు ఆశించిన స్థానాలు ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ చంద్రబాబు ఇస్తే గిస్తే ఐదారుకు మించి వారికి సీట్లు ఇచ్చే ఛాన్స్ లేదు. వామపక్ష పార్టీలు క్రమంగా కనుమరుగయిపోతున్నాయి. ఎర్రజెండాలకు ఏపీ పొలిటిక్స్ లో స్థానం లేదన్నది వాస్తవం. వారికి ప్రజల మద్దతు కూడా క్రమంగా దూరమవుతుంది. మరి వచ్చే ఎన్నికల్లోనూ వామపక్షాల పరిస్థితి క్రాస్ రోడ్స్ లో ఉందనే చెప్పాలి.

Related Posts