జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్రను మొదలు పెడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమై తొలి దశలో 45 రోజుల పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో తిరుగుతారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో నియోజకవర్గ కేంద్రాల్లో కవాతులతో పాటు రోడ్డుషోలు నిర్వహిస్తారు.ఈ యాత్ర సందర్భంగా ఆయా ఊళ్లలో ఉన్న కమ్యూనిటీ హాళ్లు లేదా కల్యాణమండపాల్లోనే జనసేన అధినేత రాత్రి బస చేయనున్నారు.చ్ఛాపురం నుంచి వెళ్లి ఉదయం 8.30 గంటలకు కవిటి మండలం కపస కుర్ది వద్ద సముద్ర తీరంలో గంగ పూజలు చేస్తారు. ఆ తర్వాత 11 గంటలకు ఇచ్ఛాపురం స్వేచ్ఛవతి ఆలయంలో పూజలు చేస్తారు. అక్కడి నుంచి బహిరంగ సభ ప్రాంతానికి చేరుకునే క్రమంలో మధ్యలో 12 గంటలకు జనసేన నిరసన కవాతు నిర్వహిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక సూరంగి రాజావారి మైదానంలో జరిగే బహిరంగసభలో పవన్‌కల్యాణ్ పాల్గొంటారు. అక్కడి నుంచి కవిటి మండలంలో పోరాట యాత్ర సాగుతుంది.