YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సునీతకు పులివెందుల టిక్కెట్

సునీతకు పులివెందుల టిక్కెట్

కడప, జూలై 6,
లోక్‌సభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ.. కొన్ని సార్లు వేగంగా.. మరికొన్ని సార్లు నెమ్మదిగా సాగుతోంది. దీంతో అసలు ఈ కేసు విచారణ ఎంత వరకు వచ్చిందంటే... సీబీఐ అధికారులే ఈ కేసుపై క్లియర్ కట్‌గా ఓ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనే ఓ టాక్ అయితే ఉమ్మడి కడప జిల్లాలో జోరుగా నడుస్తోంది. అయితే ఈ కేసులో దోషులు బయటపడతారని  వివేకా కుమార్తె   సునీత కళ్లల్లో ఒత్తులు వేసుకునీ మరీ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ కేసు విచారణ మాత్రం నత్తతో పోటీపడి నడుస్తోంది. మరోవైపు వివేకా హత్య కేసులో సీఎం జగన్‌తోపాటు కడప ఎంపీ  ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని విపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా వివేకా హత్య అనంతరం పులివెందుల్లో వైయస్ ఫ్యామిలీలోని వారే వర్గాలుగా విడిపోయారని పులివెందులలో జనం చర్చించుకుంటున్నారు. దీంతో గతంలో కడప జిల్లా అనగానే వైయస్ ఫ్యామిలీ గుర్తుకు వచ్చేదని.. నేడు ఆ పరిస్థితి లేదన్న భావన ఆ జిల్లా వాసులలో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేది ఎన్నికల సీజన్.. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో.... బాబాయ్ గొడ్డలి పోటును.. తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సీఎం జగన్ పావులు కదుపుతున్నారని వైసీపీ శ్రేణుులు అంటున్నారు.  ప్రధాన ప్రతిపక్షం సైకిల్ పార్టీకి స్పీడుకు న్ బ్రేకులు వేసేందుకు.. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి   వివేకా కుమార్తె  సునీతను వైసీపీ అభ్యర్థిగారంగంలోని  దింపాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  1978 నుంచి పులివెందుల నియోజకవర్గం వైయస్ ఫ్యామిలీకి కంచుకోట అన్న సంగతి  తెలిసిందే. వైఎస్ఆర్, ఆయన తరువాత  వైయస్ విజయమ్మ, ఇప్పుడు ఆయన కుమారుడు   జగన్ ఇక్కడి నుంచి గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెట్టిన విషయం  విదితమే. అయితే ఈ నియోజకవర్గాన్ని  సునీతకు కట్టబెట్టి.. ఇదే జిల్లాలోని జమ్మలమడుగు నుంచి   జగన్ రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకొంటున్నారని వైసీపీ వర్గాల సమాచారం.  సదరు నియోజకవర్గం కూడా వైయస్ ఫ్యామిలీకి కంచుకోటే. ఆ నియోజకవర్గంలో కూడా వైయస్ ఫ్యామిలీకి భారీగా అభిమానులున్నారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు చాలా బలంగా ఉన్నా.. ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. అదీకాక.. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి.. తొలినాళ్లలో ఇదే నియోజకవర్గంలో వైద్యునిగా పని చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సంగతి తెలిసిందే. వైయస్ జగన్ చేస్తున్న రాజకీయంలో వైయస్ వివేకా కుమార్తె సునీత చిక్కుతారో లేక తన తండ్రి హత్యకు కారకులైన వారిని న్యాయదేవత సాక్షిగా న్యాయస్థానంలో నిలబెట్టి.. వారికి కఠిన శిక్ష పడేలా చేసి.. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చేలా ఆమె.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా? అని కడప జిల్లా జిల్లా ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Posts