విశాఖపట్టణం, జూలై 6,
శతకోటి దరిద్రాలకు అనంత కోటి మార్గాలు అన్నట్టు.. విశాఖలో మత్తు ముఠాలు బరితెగిస్తున్నాయి. విద్యార్థులు యువకులు టార్గెట్గా చేసుకుని.. మత్తు సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి. నగర పరిధిలో పోలీసు నిగా పెరగడంతో.. వారి కంట పడకుండా ఉండేందుకు సరికొత్త ఆస్త్రాలను వినియోగిస్తున్నారు. బిర్యానీ ప్యాక్ చేసే కవర్లలోను, ఆన్లైన్ పార్సల్ మాదిరిగా ప్యాకింగ్ లో పెట్టి… మూడో కంటికి తెలియకుండా గంజాయిని అమ్మేస్తున్నారు. హ్యాండ్ టు హ్యాండ్ సేల్స్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతకీ వాళ్ళ నెట్వర్క్ ఎలా సాగిపోతోంది..?అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న విశాఖలో.. నేరాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టిన.. మరింతమంది మీ అరెస్ట్ చేసి జైలుకి పంపించినా నిత్యం ఏదో ఒక చోట నెరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. యువకులు విద్యార్థులు టార్గెట్గా చేసుకొని.. మత్తు ముఠా లు బరితెగిస్తున్నాయి. చాప కింద నెలల గంజాయి సప్లై ని సాగించి.. యువతను మత్తులో ముంచెత్తుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. రోజుకో సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. గంజాయిని సప్లై చేసేస్తున్నారు. చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.విశాఖ నగర పరిధిలో.. డ్రగ్స్ గంజాయి పై పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. నిఘా పెంచడంతో సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు కేటుగాళ్ళు . పోలీసులు, నిఘా వర్గాలకు చిక్కకుండా.. ఆహార పదార్థాలు మాదిరిగా పార్సిల్ చేసి అమ్మేస్తున్నారు. బిర్యానీ కర్రీస్ ప్యాకింగ్ చేసే.. అల్యూమినియం ఫాయిల్ కవర్లను గంజాయి సేల్ కోసం విచ్చలవిడిగా వినియోగించేస్తున్నారు. మరికొందరు ఏకంగా కొరియర్ పార్సెల్ మాదిరిగా.. గంజాయి ప్యాక్ హ్యాండ్ టు హ్యాండ్ సప్లై చేసేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ నే ఇంట్లో పెట్టుకుని.. ప్యాకెట్లు తయారు చేసేస్తున్నారు.గంజాయి రవాణాపై కుపి లాగిన టాస్క్ పోర్స్ పోలీసులకు.. రెండు వేరు వేరు చోట్ల యువకులు పట్టుబడ్డారు. ఆరా తీసేసరికి షాపింగ్ కు గురి చేసే వ్యవహారాలు బయటపడ్డాయి. ఎంవిపి కాలనీ రైతు బజార్ ప్రాంతంలో.. గంజాయి అమ్మకాలు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేశారు. కటారి చెన్నకేశవ, గాలి విష్ణువర్ధన్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఓ ఇంట్లో.. సోదాలు చేసేసరికి అల్యూమినియం ఫాయిల్ కవర్లలో ప్యాక్ చేసిన 113 ప్యాకెట్లు గుర్తించారు. 60 నుంచి 70 గ్రాములు చొప్పున గంజాయిని ఆ ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. వాటితోపాటు తూనిక మిషన్, ప్యాకింగ్ చేసే మరో మెషిన్ తో పాటు కర్రీస్ బిర్యానీ ప్యాకింగ్ చేసే అల్యూమినియం ఫాయిల్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే మద్దిల పాలెం చైతన్య నగర్ లో.. గుర్రం నాగేశ్వరరావు రాయుడు అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించారు. దీంతో ఆన్లైన్ ప్యాకింగ్ తరహాలో గంజాయిని ప్యాక్ చేసి అమ్ముతున్నట్టు గుర్తించారు. నాగేశ్వరావు రాయుడు గంజాయి ప్యాకెట్ల అమ్మకాల కోసం ఏకంగా ఓ కుటిర పరిశ్రమలా పెట్టుకున్నాడు. ఆన్లైన్ లో వాక్యూమ్ సీలింగ్ మిషన్ ను కొనుగోలు చేసి, బాబు రాపర్స్ ఎన్విలప్స్ సిద్ధం చేసుకున్నాడు. ట్రాన్స్పరెంట్ కావాలని కూడా వినియోగించి ఆన్లైన్ ప్యాకింగ్ లో తరహాలో పెట్టి గంజాయిని అమ్మేస్తున్నాడు. గంజాయి వాసన రాకుండా ఉండేందుకు.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్యాకింగ్ లో ఉన్న గాలిని ప్రత్యేక యంత్రం ద్వారా తీసేస్తున్నాడు.ఇలా వాసన, అనుమానం రాకుండా ప్యాక్ చేసిన గంజాయిని.. నగరంలోని యువకులు విద్యార్థులు టార్గెట్గా చేసుకొని అమ్మేస్తున్నారు ఈ కేటు గాళ్లు. గతంలో కాలేజీ చదువుకున్న విద్యార్థులు కస్టమర్లు గా.. స్నేహితులే అమ్మకందారులుగా ఉంటూ మొత్తం నెట్వర్క్ నడిపించేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ లో 60 నుంచి 70 గ్రాముల గంజాయిని పెట్టి.. ఒక్కొక్క ప్యాకెట్ వెయ్యి రూపాయలు చొప్పున అమ్మేస్తున్నారు. కిలో గంజాయిని 3 నుంచి ఐదు వేలకు కొనుగోలు చేసి.. వాడిని ప్యాకెట్ల రూపంలో మార్చి 15 నుంచి 20వేలకు అమ్మకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నమ్మకం పరిచయం ఉన్నవారికి మాత్రమే గంజాయి సప్లై చేస్తున్న ఈ కేటుగాళ్లు.. వారి ద్వారానే కొత్త వారి కూడా నెట్వర్క్ లో లాగుతున్నారు. కొంతమంది అయితే.. కస్టమర్ సెల్లర్ పరిచయం కాకుండా.. మధ్యవర్తిగా ఉంటూ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మరీ గంజాయిని సేల్ చేసేస్తున్నారు. చెప్పినచోట తీసుకెళ్లి గంజాయి ప్యాకెట్లు ఇచ్చేందుకు.. మరి కొంతమంది యువకులకు ఎరవేసి డైలీ వేతనం లా చెల్లింపులు చేస్తున్నారని అంటున్నారు ద్వారకా ఏసీపీ మూర్తి.మత్తు ముఠాలు అన్వేషిస్తున్న సరికొత్త మార్గాలకు చెక్ చెప్పేలా విశాఖ సిపి శ్రీకాంత్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫుల్ పవర్స్ కల్పిస్తూ.. మరింత బలోపేతం చేస్తున్నారు. సరికొత్త టెక్నాలజీ తో మత్తు ముఠాలను ట్రాక్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. యువత, విద్యార్థులు ఈ మత్తు మాఫియా చేతుల్లో పడి జీవితం నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. విశాఖను మత్తు రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు తమకు సహకరించాలని కోరుతున్నారు విశాఖ సీపీ శ్రీకాంత్. ఇప్పటికైనా యువత మేలుకోవాలి. పోలీసులు చేస్తున్న ప్రయత్నానికి చేయి కలపాలి. ఇటువంటి మత్తు ముఠా ల భరతం పట్టి విశాఖను మత్తు రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.