YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అంగన్ వాడీ గుడ్లు గోల్ మాల్

అంగన్ వాడీ గుడ్లు గోల్ మాల్

 అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని గర్బిణులకు ప్రతీ నెల 16 గుడ్లు ఇస్తారు. 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో 8 ఉడికించిన గుడ్లు ఇస్తారు. 3నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు వారానికి నాలుగు రోజులు ఉడికించిన గుడ్లు పెడతారు. అయితే కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు చాలా చిన్నసైజులో ఉంటున్నాయి. వీటి సరఫరా పేరుతో నిధులు గోల్‌మాల్‌ అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్‌ తనకు నచ్చిన రీతిలో వాటిని సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న గుడ్లు చాలావరకూ చిన్నవిగానే ఉంటున్నాయి. సాధారణంగా గుడ్డు బరువు 50 నుంచి 55 గ్రాములుంటుంది. కానీ ఈ కేంద్రాలకు సరఫరా అవుతున్నవి మాత్రం 35 గ్రాముల నుంచి 40 గ్రాములకు మించట్లేదు. పిల్లలకు అందించే గుడ్లు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నాణ్యమైన గుడ్లను సరఫరా చేయడం లేదనే ఆరోపణలు వినిస్తున్నాయి. చిన్న గుడ్లు సరఫరా చేస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్న ప్రచారం సాగుతోంది.జిల్లాలో 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 2987 అంగన్‌వాడీ, 742 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో మూడేళ్లలోపు పిల్లలు 85,331మంది, 3 నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు 47,074మంది, గర్భిణులు 22,457మంది, బాలింతలు 21,638 మంది ఉన్నారు. మొత్తం 1,76,500 మంది లబ్ధిదారులకోసం నెలకు 21,41,352 గుడ్లు సరఫరా అవుతున్నాయి. ఇందులో మూడేళ్ల లోపు పిల్లలకు 6,82,648 గుడ్లు, 3ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు వారికి 7,53,184, గర్బిణులు, బాలింతలకు 7,05,520 గుడ్లు సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం నెలకు రూ.1,07,06,760 వరకు ఖర్చు చేస్తున్నారు.

Related Posts