YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కుప్పంలో మారుతున్న సమీకరణాలు

కుప్పంలో మారుతున్న సమీకరణాలు

తిరుపతి, జూలై 7,
వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం నడుపుతున్న విషయం తెలిసిందే…చంద్రబాబు అడ్డాగా ఉన్న కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. మామూలుగా కుప్పంలో చంద్రబాబుకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. 1989 నుంచి 2019 వరకు వరుసగా ఏడు సార్లు చంద్రబాబు కుప్పంలో గెలిచారు. అయితే ఈ సారి చంద్రబాబుకు ఛాన్స్ ఇవ్వకూడదని వైసీపీ భావిస్తుంది.
అందుకే మంత్రి పెద్దిరెడ్డి మొదట నుంచి కుప్పంపైనే టార్గెట్ పెట్టారు. అక్కడ టీడీపీని వీక్ చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేసి వైసీపీని గెలిపించారు. అయితే చంద్రబాబు సాధారణ ఎన్నికల్లోనే కుప్పం ప్రచారానికి వెళ్లరు..కానీ కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి బాబు వచ్చారు. బాబు వచ్చిన సరే కుప్పం మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలోనే పడింది.ఇక ఇక్కడ నుంచి బాబు కుప్పంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. కనీసం నెలకొకసారైన కుప్పం వస్తున్నారు. అలాగే అక్కడ పర్మినెంట్ గా ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. ఇదంతా పెద్దిరెడ్డి ఎఫెక్ట్ అనే చెప్పాలి. అయితే బాబు అలెర్ట్ అయ్యే కొద్ది, పెద్దిరెడ్డి ఇంకా దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ తరుపున ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తారని చెప్పేశారు. ఇక అభ్యర్ధిని ప్రకటించిన దగ్గర నుంచి కుప్పంలో టీడీపీ శ్రేణులని వైసీపీలోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి వచ్చారు. తాజాగా మరికొందరు వైసీపీలో చేరారు.అయితే ఇలా రోజురోజుకూ టీడీపీ కార్యకర్తలు జంప్ అయిపోతుండటంతో…ఇంకా కుప్పం సీటుని బాబు వదులుకుంటారేమో అని ప్రచారం నడుస్తోంది…ఇప్పటికే వైసీపీ నేతలు…బాబు, కుప్పం వదిలి పారిపోతారని అంటున్నారు. కానీ బాబు కుప్పం వదిలే ప్రసక్తి లేదని, ఎనిమిదో సారి కూడా అక్కడ గెలిచి సత్తా చాటుతారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరి చూడాలి ఈ సారి కుప్పంలో బాబు పరిస్తితి ఎలా ఉంటుందో

Related Posts