విజయవాడ, జూలై 8,
ఆర్థిక లోటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా ప్రధానమంత్రి భీమవరం వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి అందచేసిన విజ్ఞాపన పత్రంలో 34 వేల కోట్ల రూపాయల లోటు నిధులు విడుదల చేయాలని కోరారు. అయితే, ఈ లెక్కలను కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర బిజెపి కూడా తోసిపుచ్చుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2014-15లో లోటు 16వేల కోట్ల రూపాయలుగా తేల్చిన సంగతి తెలిసిందే. అలాగే తొలి ఐదేళ్ల కాలానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు లోటు వివరాలు కేంద్రానికి అధికారులు నివేదిస్తూ నిధులు కోరుతున్నారు. మరోవైపు ఇటీవల రాష్ట్ర బిజెపి తయారుచేసిన నివేదికలో లోటు అంశాలపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16000 వేల కోట్లరూపాయలను ఆ పార్టీ అంగీకరించడం లేదు. అప్పటిలోటు కేవలం 6,609 కోట్ల రూపాయలేననిచెబుతోంది. ప్రస్తుతం బిజెపిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా దీనినే బలపరుస్తుండటం విశేషం. ఆర్థికశాఖలో కూడా అత్యున్నత బాధ్యతలు నిర్వహించిన ఆయన అప్పట్లో ప్రభుత్వం రూపొందించిన నివేదికలో కీలకపాత్ర పోషించారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 2014 వరకు వివిధ స్థాయిలో పనిచేసిన ఆయన ఆ తరువాత చీఫ్ సెక్రటరీగా వ్యవహరిరచారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక వ్యవహారాలపై బిజెపి ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ కొత్తగా అమలు చేస్తున్న పథకాల వల్ల అయ్యే వ్యయాన్ని కూడా లోటుగా భరించాలని రాష్ట్రం కోరడాన్ని తప్పు పట్టింది. ఇప్పటివరకు ఆదాయ లోటు కింద 2015-16 నుంచి 2019-20 వరకు 22,113 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చినట్లు కమిటీ నివేదికలో