సుజాతనగర్
కొందరి పుట్టుకకు అర్థం పరమార్ధం ముందే రాసి ఉంటుంది దానికి నిదర్శనం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నేత నాగ సీతారాములు అన్నారు. శుక్రవారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ద్వారా పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయి చదువులు చదివేలా చేసి ఉన్నతోద్యోగాల్లో చేరేలా చేసిన ఘనత ఆయనదన్నారు. ఏదైనా పెద్ద జబ్బు చేస్తే తమకు చావే గతి అనుకునే వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని అందించి ప్రజారోగ్యానికి భరోసానిచ్చిన మహనీయుడని, సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో దేవుడిలా కొలువై ఉన్నాడన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొద్ది కాలం మాత్రమే పాలించిన వైఎస్ పేదల సంక్షేమం కోసం తెచ్చిన పలు పథకాలు, తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇలాంటి నాయకుడు ఇక ముందు రారనేది స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయ పాలకుడికి మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో అవన్నీ చేసి చూపించారు. జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్ 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. సీఎంగా ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులను చేపట్టారు. 2009 నాటికే 16 ప్రాజెక్టులను పూర్తిగా.. 25 ప్రాజెక్టులను పాక్షికంగా వెరసి 41 ప్రాజెక్టుల ద్వారా 19.53 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 3.96 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డు నెలకొల్పారన్నారు. అనారోగ్యం పాలైన పేద కుటుంబాలు ఆపత్కాలంలో సాయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి ఎనలేని భరోసా ఇచ్చింది. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారన్నారు. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను పలు రాష్ట్రాలు అనుసరించాయి. పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కారాదనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి వైఎస్సార్ రూపకల్పన చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పి లక్షలాది మందికి ఉన్నత చదువుల భాగ్యం కల్పించారు. రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటారు. వారిలో దివంగత వైఎస్సార్ ముందు వరుసలో నిలుస్తారు. పులివెందుల నియోజకవర్గం నుంచి 1978, 1983, 1985 ఎన్నికల్లో అసెంబ్లీకి, కడప లోక్‌సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో పార్లమెంట్‌కి, ఆ తర్వాత మళ్లీ పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి వరుసగా వైఎస్ రాజశేఖరరెడ్డి విజయాలు సాధించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్ చార్జీలు కట్టలేని రైతులపై నాడు టీడీపీ సర్కార్ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తి వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షల పంపు సెట్లకుపైగా ఉచిత విద్యుత్ అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాత ఏడాది రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌పై వెనక్కు తగ్గలేదు. వైఎస్ స్ఫూర్తితో పలు రాష్ట్రాలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. పావలా వడ్డీకే రైతులకు రుణాలు అందించారు. పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించారన్నారు.
వైఎస్సార్ అందిరి వాడు వైఎస్ వజయమ్మ
ప్లీనరీలో వైఎస్ విజయమ్మ మాట్లాడారు. నా జీవితంలో ప్రతి మలుపు ప్రజాజీవితాలతో ముడి పడి ఉంది అని వైఎస్ఆర్ చెబుతుండేవారు. రాజశేఖర్ రెడ్డి నా వాడే కాదు..మీ అందరీ వాడు. మీ అందర్నీ అభినందించడానికి, ఆశీర్వదించడానికి వచ్చాను. రాజకీయ పార్టీలు అధికారం కోసం పుడతాయి. వైఎస్ఆర్ లేడని తెలిసి 700 మంది ప్రాణాలు వదిలారు. కోట్లాది మంది అభిమానం నుంచి వైఎస్ఆర్ సీపీ పుట్టింది. దేశంలోని వ్యవస్థలు అన్నీ దాడి చేసినా..మనం చేస్తున్నది న్యాయం, ధర్మం అని..కష్టాలు బాట ముందని తెలిసినా కూడా కన్నీళ్లను తుడవటానికి వైఎస్ఆర్ సీపీ పుట్టింది. ఎన్నో కష్టాలను , నిందలను ఎదుర్కొని వైఎస్ఆర్ కుటుంబం నిలిచింది. అధికార శక్తులన్నీ జగన్ పై విరుచుకుపడ్డ బెదరలేదు. ఎన్నో విలువలు, మానవత్వంతో వైఎస్ఆర్ సీపీ పురుడు పోసుకుందని అన్నారు.
నిజాయితీగా ఆలోచన చేసే వ్యక్తిత్వం జగన్ ది. లక్షా 60వేల కోట్లు ప్రజలకు ప్రత్యక్షంగా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అందించింది. గడపగడపకు ఎమ్మెల్యేలను పంపుతున్నాడంటే..తాను మంచి చేశానని నమ్మడం వల్లనే పంపుతున్నాడు. నాడు - నేడు తో బడుల రూపురేఖలు మారిపోతున్నాయి. మానవత్వంతో, మనసుతో చేసే పాలన. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు దిగారని అన్నారు.
పరిపాలనలో జగన్ విప్లవం తెచ్చారు. జగన్ చెప్పినవే కాకుండా...చెప్పనవి కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో పేద తల్లులు, పేద తండ్రులు మీ బిడ్డలను జగన్ చేతిలో పెట్టండి...జగన్ మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. పేద బిడ్డల భవిష్యత్ను జగన్ చూసుకుంటారని అన్నారు.
రైతుల కలలను జగన్ నెరవేరుస్తాడు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. వైఎస్ జగన్ మాస్ లీడర్. దుర్గ ఫ్లైఓవర్ను చంద్రబాబు ఐదేళ్లో పూర్తి చేయలేకపోయారు. జగన్ సీఎం అయ్యాక పూర్తి చేశారు. జగన్ యువతకు రోల్ మోడల్. మీ అందరి ప్రేమను పొందిన జగన్ను గర్వపడుతున్నా. కడప ప్రజలు మొదటి నాతో ఉన్నందకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఉమ్మడి రాష్ట్రం వైఎస్ఆర్ను మహామనిషిని, మహర్షిని చేసింది. రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నప్పుడు నిత్యం ఏం చేయాలి..ఏం చేయాలని ఆలోచించేవారు. వైఎస్ఆర్ అంటే ప్రజలకు ప్రాణాలు పోయేంత ప్రేమఅని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పరిపాలనలో సీఎం జగన్ విప్లవం తెచ్చారు. ప్రజలకు, వైఎస్ కుటుంబానికి 45 ఏళ్లు. ఇకపై కూడా నా అనుబంధం కొనసాగాలి. జగన్ మనసుతో చేసే పాలన నా కళ్లారా చూస్తున్నాని ఆమె అన్నారు.