YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్నాధుని ఆశీస్సులతో సుభిక్షంగా ఆంధ్రప్రదేశ్

జగన్నాధుని ఆశీస్సులతో సుభిక్షంగా ఆంధ్రప్రదేశ్

జగన్నాధుని ఆశీస్సులతో సుభిక్షంగా ఆంధ్రప్రదేశ్  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  ఇస్కాన్ జగన్నాధ యాత్రను ప్రారంభించిన గవర్నర్  నగరంలో ఎనిమిది కిలోమీటర్ల రధయాత్ర.
జగన్నాధుని ఆశీస్సులతో  రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మానవ ప్రయత్నానికి అండగా దైవ సంకల్పం తోడైతే అంతా శుభమే జరగుతుందన్నారు. ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ జగన్నాధ స్వామి రధయాత్రను శుక్రవారం గవర్నర్ విజయవాడ వజ్ర గ్రౌండ్స్ నుండి ప్రారంభించారు. రధ పూజతో గవర్నర్ జగన్నాధ రధయాత్రను తొలిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అధ్యాత్మికత ప్రజల మధ్య శాంతి సామరస్యాలను హేతువుగా నిలుస్తుందన్నారు. పూరి జగన్నాధ రధయాత్ర ప్రపంచ ప్రసిద్ది నొందిన రధయాత్రగా గుర్తింపు పొందిందన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద భక్తి సమూహంగా పూరి రధయాత్ర నిలించిందన్నారు. ఇస్కాన్ దేవాలయ ప్రతినిధులు మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారని, ఈ రోజు 80పైగా దేశాలలో సుమారు 400ల వరకు రధయాత్రలను ఇస్కాన్ నేతృత్వంలో భక్తజనావళి ఆధ్వర్యంలో జరుగుతుండటం మంచి పరిణామమన్నారు. విజయవాడలో తొలిసారి రధయాత్రను చేపడుతున్నప్పటికీ జగన్నాధుని ఆశీస్సులతో ఇది భవిష్యత్తులో అతి పెద్ద రథయాత్రగా రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేసారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణా మండలి అధ్యక్షులు ఎకె ఫరీడా, ఇస్కాన్ దేవాలయ అధ్యక్షుడు చక్రధారి దాస్, వేణుధారి దాస్, శ్యామసుందర అత్యుత దాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts