YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సేంద్రియ వ్యవసాయం పై రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ద లేదు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

సేంద్రియ వ్యవసాయం పై రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ద లేదు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  సోమువీర్రాజు

విజయవాడ
ప్రకృతి వ్యవసాయంపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం అనంతరం యూనివర్సిటీ ఏర్పాటు సంబంధిత అంశాలను ప్రైవేటు కంపెనీల తో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేస్తామనడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సేంద్రియ వ్యవసాయంపై మరియు దాని రూపకల్పన పై సరియైన ఆలోచన లేద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  సోమువీర్రాజు అన్నారు.  ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా జీతాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మండల వ్యవసాయ కేంద్రాలలో పనిచేస్తున్న విఎఓ లను వారి విధుల నుండి తప్పించి వారికి సంబంధం లేని పనులు చేయిస్తూ సేంద్రియ వ్యవసాయానికి వారు చేస్తున్న సేవలను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అయన అన్నారు.
సేంద్రీయ వ్యవసాయం పై సిఎం జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలు ప్రస్తావించారు. ఒక యూనివర్సిటీ పెడతామని, ఇతర దేశాలతో ఒప్పందం చేసుకుంటాం అన్నారు. .ఆత్మ అనే శాఖ ద్వారా అన్ని రాష్ట్రాల్లో  సేంద్రీయ వ్యవసాయం చేయాలని కేంద్రం సూచించింది. అగ్రికల్చరల్ విద్యార్థులు,  అధికారులు తో అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వారికి జీతాలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తుందని అయన అన్నారు.
జగన్ ప్రభుత్వం వారిని హైదరాబాద్ లో   తొలగించి విజయవాడ తీసుకు వచ్చింది.  విమానాశ్రయం వద్ద  ఒక కార్యాలయం లో పెట్టి వేరే పనులు చేయిస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయం విధానం పై రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేదు. యూనివర్సిటీ అంటూ దిశ దశ లేకుండా అనాలోచితంగా నిర్ణయాలు చేస్తుందని అన్నారు.
ఎక్కడా లేని విధంగా ఎపికి మూడు కారిడార్లను కేంద్రం ఇచ్చింది. ఐదు లక్షల ఉద్యోగాలు, పెట్టుబడులు వచ్చే లా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. లక్ష కోట్ల రూపాయలు ను దేశంలో ఉన్న అన్ని రాష్టాలకు రుణాలుగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు ఇచ్చేలా గైడ్ లైన్స్ పెట్టారు. ఎపిలో కొన్ని రైల్వే లైన్లకు కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం ఖర్చు పెట్టాలి. కాకినాడ-నరసాపురం  రైల్వే లైన్ కు రాష్ట్ర ప్రభుత్వం వాటా పెట్టలేదు. నడికుడి-కాళహస్తి, కడప-బెంగుళూరు  రైల్వే లైన్లకి జగన్ ప్రభుత్వం భూములు కొనలేదు. ఈ మూడు లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అన్నారు.

Related Posts