రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోని'. ఈ చిత్రం లో మద్దతా అను ఇమ్మానుయేల్ ని హీరోయిన్ గా అనుకున్నారు, ఆమె కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఇలియానాను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో రీ ఎంట్రీ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఇలియానా ఈ ఛాన్స్ వదులుకోక పోవచ్చని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో దేవుడు చేసిన మనుషులు చిత్రం వచ్చింది. మరో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.