YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

జూన్ 2 న గ్రూప్ నోటిఫికేషన్

జూన్ 2 న గ్రూప్ నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. జూన్‌ 2న నోటిఫికేషన్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చిన 76 గ్రూప్‌–1 పోస్టులతో పాటు తాజాగా 42 డీఎస్పీ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వాటితో పాటు 2011 గ్రూప్‌–1లో మిగిలిపోయిన పోస్టులు మరో 7 వరకు ఉన్నాయి. అయితే ఇవే కాకుండా ఇతర శాఖల్లోనూ పదుల సంఖ్యలో పోస్టులు ఉండే అవకాశముంది. వాటి భర్తీకి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉంది.  వీటికి కూడా అనుమతి వస్తే జూన్‌ 2న టీఎస్పీఎస్సీ ద్వారా 150కి పైగా పోస్టులతో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ను జారీ చేసే అవకాశం ఉంది

Related Posts