YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విజయ్ మాల్యాకు షాక్

విజయ్ మాల్యాకు షాక్

న్యూఢిల్లీ, జూలై 11,
బిజినెస్ టైకూన్, కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడిన కేసులో విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. అలాగే 2,000 రూపాయల జరిమానా కూడా విధించింది. జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 2017లో విజయ్‌ మాల్యా సుప్రీం కోర్ట్‌ తీర్పును ఉల్లంఘిస్తూ మాల్యా 40మిలియన్‌ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు.ఆ సమాచారాన్ని కోర్ట్‌కు చెప్పే ప్రయత్నం చేయలేదు. పైగా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. దీంతో మాల్యాపై సుప్రీం కోర్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరిపింది. ఇప్పటికే కేసు విచారణ నేపథ్యంలో పలు మార్లు మాల్యా కోర్ట్‌కు హాజరు కావాలని సుప్రీం కోర్ట్‌ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ మాల్యా సుప్రీం కోర్టుకు హాజరవ్వలేదు. ఈ తరుణంలో కోర్ట్‌ ధిక్కారం కేసుకు సంబంధించి సుప్రీం కోర్ట్‌ తుది తీర్పు ఇచ్చింది. తన పిల్లలకు బదిలీ చేసిన 40 బిలియన్ డాలర్ల మొత్తాన్ని నాలుగు మాసాల్లో వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని, లేనిపక్షంలో ఆస్తుల్ని అటాచ్ చేయాల్సివస్తుందని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.

Related Posts