తిరుపతి, జూలై 12,
ఏపీలో రాజకీయపరిణామాలు వేగం పుంజుకుంటున్నాయి. జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభు త్వం విఫలమయి, వైసీపీ నేతల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందనాలి. మరో వంక నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో టిడిపీ మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష జనంలో వస్తున్న స్పందనతో బాగా తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న టిడిపీకి జనంలో మళ్లీ మద్దతు లభిస్తోంది. గట్టిగా అనుకుంటే 2024లో అధికారంలోకి రావడానికి అవకాశాలు లేకపోలేదన్న ధీమా వ్యక్తం చేస్తున్నా రు టిడీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం కూడా తమ అధికార ఆకాంక్షలను వ్యక్తం చేస్తూ సమావేశమై ఒక గట్టి నిర్ణయానికి రావడానికి సమాయత్తమవుతున్నారు. తిరుపతిలో ఒక ప్రయివేట్ ఫంక్షన్ హాల్‌లో గ్రేటర్ రాయలసీమ బలిజ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ భేటీకి రాయల సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బలిజ సామాజికవర్గానికి చెందిన నేతలు హాజయ్యా రు. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, మాజీ ఎంపీ సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ చెంగల రాయులు, మాజీ ఎమ్మెల్యే మనోహర్, సుగణమ్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొ న్నారు.గ్రేటర్ రాయలసీమలోని ఆరు జిల్లాలలో బలిజల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ.. తగిన ప్రాతినిధ్యం దక్కలేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మా సామాజికవర్గం నుంచి ఎంపీలు లేరు. రాజ్యసభకు ప్రాతినిధ్యం లేదు. మిగతా ఏడు జిల్లా ల్లోని కాపులకు తగిన ప్రాతినిధ్యం లభించింది. వారు రాజకీయంగా ముందంజ వేశారు. అందుకు విరుద్ధం కాదు కానీ వాళ్లకు మేం సరైన బలం ఇవ్వలేక పోతు న్నామని కాపులు భావిస్తున్నారు. ఎక్కువ జనాభా ఉన్న బలిజలకు కనీసం 20-30 ఎమ్మెల్యే లు, 4-5 ఎంపీలు, 4-5 ఎమ్మెల్సీ పదవులు దక్కాల్సి ఉంది. కాపు కులస్తులు రాజకీయంగా ఎదగడానికి ఏ పార్టీ అయినా సరే సహకారం అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించామని అన్నారు. ఓసీలైన బలిజ లకు రిజర్వేషన్ లేకపోవడం తో వెనుక బడ్డారు, దాన్ని ఎలా అధిగమించాలనే విషయమై తిరుపతి సమా వేశం చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ ఏదైనా సరే మా వాళ్ల ప్రాతినిధ్యం పెరగాలన్నదే మా ఉద్దేశం. ఈ సమావే శానికి పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చారు.కమ్మ, రెడ్డిలకు కాపుల ఊసే ద్వితీయస్థానం, వారికి దక్కాల్సిన హక్కును నిరాకరిస్తూ రాజకీయంగా అధి కారం చెలాయిస్తున్నా రని ఆరోపిస్తున్నారు. సుమారు నూట ఇరవై సంవత్సరాల క్రితం, బహుశా పంతొ మ్మిదవ శతాబ్దం చివరిలో, వారి సామాజిక స్థితి కమ్మల కంటే ఎక్కు వగా ఉందని కాపులు నమ్ముతారు. కానీ కమ్మలు వ్యాపారం, వాణిజ్యం, విద్యను వేగంగా తీసుకున్నారు. చాలా కట్టుదిట్టంగా కమ్మలు సామా జిక అభివృద్ధి క్రమంలో అగ్రస్థానానికి చేరుకోవడా నికి వేగంగా అడుగులు వేయగలిగారని వారి చరిత్ర పేర్కొంది. ఉద్యోగాలు, చదువుల విషయంలో తాము వెనుకబడి ఉన్నామని చెబుతూ కాపు సామాజికవర్గం స్వాతం త్య్రానికి ముందు తమ లాగే వెనుకబడిన కులాల కేటగిరీలో చేర్చాలని డిమాండ్ చేస్తోంది. 1993 లో కాపు లను ‘వెనుకబడిన కులాల్లో’ చేర్చాలని కోరుతూ మొదటి పెద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత 1994లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆదేశాన్ని గౌరవించలేదని కాపు నాయకులు ఆరోపి స్తున్నారు.రాయలసీమలో తమ జనాభా 27 శాతం ఉంటుందని. కానీ ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారని బలిజ నేతలు తెలిపారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాలను కూడా కలుపుకుంటే.. తమ వర్గం నుంచి కేవలం ఇద్దరు ఎమ్మె ల్యేలు మాత్రమే ఉన్నారన్నారు. బలిజ సామా జికవర్గం సీట్లను అడిగే స్థాయి నుంచి మరొకరికి సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఈ సమావేశానికి హాజరైన కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ని కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు, బలిజ తదితర ఉప వర్గాలన్నీ కాపు సామాజిక వర్గం కిందకు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సామాజికవర్గం జనాభా ఎక్కువ. ముఖ్యంగా ఆంధ్రాలో 27 శాతం జనాభా తమ వర్గానిదేనని కాపులు చెబుతుంటారు. అయినా సరే రాజకీయంగా తమకు తగిన ప్రాతి నిధ్యం దక్కడం లేదనే భావన ఈ వర్గంలో ఉంది. కేవలం ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కాపులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వర్గానికి చెందినవారనే సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు చిరంజీవి సైతం తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కాపులు మళ్లీ ఉద్యమించితే జగన్ అధికార కాంక్ష దెబ్బ తినే అవకాశం దెబ్బతినవచ్చు.