YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దుమారం రేపుతున్న సత్యకుమార్ వ్యాఖ్యలు

దుమారం రేపుతున్న సత్యకుమార్ వ్యాఖ్యలు

విజయవాడ, జూలై 12,
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అద్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ స్నేహ సంబంధాలు, అదో రకంగా, కొంచెం చాలా చిత్రంగా ఉంటాయి. అ రెండు పార్టీలు మిత్ర పక్షాలు కాదు. అలాగని శతృ పక్షాలు అసలే కాదు. బీజేపీ సారధ్యంలోని అధికార ఎన్డీఎ కూటమిలో వైసీపీ భాగస్వామ్య పక్షం కాదు. అయినా, బీజేపీ సహా ఎన్డీఎ భాగస్వామ్య పార్టీల నాయకులకంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నాయకులు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా’కు ఎక్కువ గౌరవం ఇస్తారు. ఎందుకు ఏమిటీ, అన్నది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి మెడ మీద వెళ్ళాడుతున్న అక్రమాస్తుల కేసులే, అందుకు కారణం. అందుకే, ఆ రెండు పార్టీల శత్రుమిత్ర సంబంధాల విషయంలో, అప్పుడప్పుదు ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే, ఎవరి రాజకీయం వారిది అయినా, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే విషయంలో మాత్రం, ఎలాంటి మొహమాటం లేకుండా, నువ్వొకందుకు పోస్తే, నేనొకందుకు తాగుతున్నా, అన్న పద్దతిలో రెండు పార్టీలు ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లాగా కలవకుండానే  కలిసి ప్రయాణం చేస్తున్నాయి. అందుకే, రెండు పార్టీలను రాజకీయ విశ్లేషకులు, రహస్య ప్రేమికులుగా అభివర్ణిస్తుంటారు. వైస్సీపీ ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ కాదు, కానీ, రాష్ట్రపతి ఎన్నికల ప్రకటనకు ముందు నుంచి కూడా, రాజకీయ విశ్లేషకులు వైసీపీ ఓటును ఎన్డీయే ఖాతాలో కలిపే లెక్కలు వేశారు. ఎన్డీయే గెలుపునకు అవసరమైన స్వల్ప వ్యత్యాసాన్ని, వైసీపీ, ఒరిస్సాలో అధికారంలో ఉన్న బీజేడీ భర్తీ చేస్తాయని, సో.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి గెలుపుకు ఢోకా లేదని విశ్లేషకులు బహిరంగ చర్చల్లో పేర్కొన్నారు. అయినా, ఉభయ పార్టీల నాయకత్వం అవునని కానీ, కాదని కానీ, తమ మధ్య ఇంకా చర్చలే జరగలేదని కానీ, ఒక ప్రకటన చేసిన పాపాన పోలేదు. ముఖ్యంగా వైసేపీ నాయకత్వం, అంతేగా, అంతేగా   అన్నట్లుగా మౌనంగా ఉండిపోయింది. మాములుగా అయితే మౌనం అర్ధాంగీకారం అయితే కావచ్చునేమో కానీ, ఈ విషయంలో మాత్రం సంపూర్ణ అంగీకారంగానే అంతా భావిస్తున్నారు.  అయితే ఇప్పడు, ఎన్డీయే  రాష్ట్రపతి అభ్యర్ధి, ద్రౌపతి ముర్ము, అన్ని పార్టీల మద్దతు కోరేందుకు విజయవాడ వస్తున్నసమయంలో. రెండు పార్టీల మధ్య ఓ చిలిపి తగువు తెరపై కొచ్చింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ముఖ్య నేతలు ఎవరూ వైసీపీ మద్దతు కోరలేదని, అయినా వైసీపీ నేతలే మద్దతు ఇస్తామని వెంట పడుతున్నారు అన్న అర్థం వచ్చేలా కొంచెం ఘాటు  వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా, బీజేపీ దృష్టిలో వైసీపీ అంటరాని పార్టీయేననీ, అయితే, తాము బీజేపీతో కలిసే ఉన్నామనే భ్రమను సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  బీజేపీ జాతీయ నాయకులు, వైసీపీ మద్దతు కోరారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, వైసీపీ మద్దతు తెలిపింది అనేది మాత్రం నిజం. ఎందుకంటే, రాష్ట్రంలో ప్రచారానికి వస్తున్న ముర్ము వైసీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ముర్ముకు ముఖ్యమంత్రి జగన్  తన నివాసంలో తేనేటి విందు ఏర్పాటు చేశారు. అంటే, రాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ, ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ఇస్తోంది. అందులో మరో అభిప్రాయనికి తావు లేదు.  అయితే, సత్యకుమార్ ఈ సమయంలో వైసీపీ నాయకత్వాన్ని నొప్పించే వ్యాఖ్యలు ఎందుకు చేశారు ? అంటే, అది కూడా, రెండు పార్టీల మధ్య  సీక్రెట్ ఒప్పందంలో భాగమే అంటున్నారు. నేను కొట్టినట్లు చేస్తాను, నువ్వు ఏడ్చినట్లు చేయి అన్నచందంగా, బీజేపీ, వైసీపీ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన వైసీపీ ప్లీనరీలో జగన్ రెడ్డి  కేంద్ర ప్రభుత్వంపై, మొక్కుబడిగా కొన్ని విమర్శలు చేశారు. ఆయన చేసిన  విమర్శలకు సమాధానం అన్నట్లుగా సత్యకుమార్ ప్రతి విమర్శలు చేశారు. అయితే, ముఖ్యమంత్రి ప్లీనరీ వేదికగా చేసిన విమర్శలు. సత్యకుమార్ చసిన ప్రతి విమర్శలు  ఉత్తుత్తి  విమర్శలే తప్ప, మరొకటి కాదని, మరొకరు, మరొకరు కాదు, రెండు పార్టీల నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. బీజేపీ, వైసీపీ లవ్ స్టొరీ లో ఇదో ట్విస్ట్ అంటున్నారు.  అదీ సంగతి.

Related Posts