YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారించాలి సీఎం జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ

మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారించాలి సీఎం జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ

విజయవాడ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, సమ్మె విరమింప చేయండి. గత 3 సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన పారిశుధ్య కార్మికుల సమస్యలు విస్మరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. అసలే వానాకాలం వల్ల పారిశుధ్యం లోపించి వ్యాధులు వ్యాపించి, అనారోగ్య పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. మున్సిపల్ కార్మికుల హెల్త్  అలవెన్స్ బకాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సమాన పనికి సమాన వేతనం, సిబ్బందిని పెంచడం వంటి పలు సమస్యలను తక్షణమే పరిష్కరించండని అన్నారు.

Related Posts