విజయవాడ, జూలై 13,
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తాజా మాజీ మంత్రి పేర్ని నానీ వ్యాఖ్యలు, వాటికి కౌంటర్‌గా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు, ట్వీట్ కౌంటర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. వైసీపీలోని కొందరు మరీ ముఖ్యంగా పేర్ని నాని వంటి వారు నోటి విరోచనాలతో బాధపడుతున్నారని నాగబాబు ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. పేర్నికి ఇప్పుడు కావలసింది తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమేననీ, బందరులో వైద్యుడు ఉంటే.. ఆయన నోటి విరోచనాలకు మందు ఇవ్వాలని కోరుతున్నాననీ నాగబాబు ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. అదే సమయంలో జనసేనానిపై పేర్ని నాటి వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్లీనరీలో ఇష్టారీతిన మాట్లాడి జగన్ వద్ద మార్కులు కొట్టేయడానికి చేసిన ప్రయత్నం ఫ్లాప్ అయ్యిందని పేర్ని నానిని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఎంత తాపత్రేయపడినా నానికి మార్కులు పడలేదనీ, మరో తాజా మాజీ మంత్రి అనీల్ కుమార్ జగన్ వద్ద గుడ్ విల్ సంపాదించేశాడన్న దుగ్ధతోనే, ఫ్రస్ట్రేషన్ తోనే ప్లీనరీ ముగిసిన 24 గంటల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చి మరీ పవన్ కల్యాణ్ మీద ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో నవరత్నాలంటూ ఇచ్చిన హామీలు నకిలీవని ఇప్పుడు తేలిపోవడం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. మీడియా సమావేశంలో పేర్ని నాని జనం జగన్ ను నమ్మారు, నమ్మారంటూ పదేపదే చెప్పడాన్ని కూడా ప్రశ్నించి ఎద్దేవా చేస్తున్నారు.నిజంగా జగన్ ను జనం నమ్మి ఉంటే ప్రశాంత్ కిశోర్ వ్యూహాల అవసరమేమిటని ప్రశ్నించారు. ఇటీవల బందరులో స్థానిక ఎంపీ బాలశౌరి పర్యటనను అడ్డుకొనేందుక నీ రైట్ హ్యాండ్ స్థానిక కార్పొరేటర్, నీ కుమారుడి జాన్ జిగ్రీ దోస్త్‌ను ఎగదోసి... ఆ తర్వాత జగన్, సజ్జల చేత అక్షింతలు వేయించుకొన్న పేర్ని నాని, తాడేపల్లి ప్యాలెస్ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వద్ద ఘొల్లు మని ఏడ్చింది నిజంకాదా అని నిలదీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బందరులో తన గెలుపు సాధ్యం కాదని ముందే తెలుసుకున్ననాని, ఓటమి బలిపీఠంపై కుమారుడు పేర్ని కిట్టును నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నార