విజయవాడ, జూలై 13,
పూర్వం ఎన్టీఆర్‌ను ఎంతో ప్రేమగా తమ వాడిగా చేసుకుని ఎన్టీవోడు అన్నారు యావత్ ఆంధ్రాజనం. 99 ప్రపంచకప్ విజయం తర్వాత ధోనీ పేరుతో ట్యాటూలు వేయించుకున్నారు అమ్మాయిలూ, క్రికెట్ పిచ్చా ళ్లు. అభిమానానికి, వీరాభిమానానికి పెద్ద తేడా లేకపోవచ్చుగాని, దాన్ని తెలియజేయడంలో మాత్రం చాలా తేడా చూపుతారు సదరు వీరాభిమానులు. వీరాభిమానులు రాజకీయనాయకులకూ వుంటారు. ప్రస్తుతం అంతటి వీరాభిమాని అభిమాన వర్షంలో తడిసి ముద్దై పలుకించిపోతున్నది మాత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు అనే అనాలి. తమ నాయకుడు ఓ చిన్నపాటి మంచి పని చేస్తే కటౌట్‌కి పాలాభిషేకం చేసేస్తున్నారు ఈ రోజుల్లో. అలాం టిది ఆంధ్రాలో మళ్లీ అధికారంలోకి రావడానికి పార్టీని నాలుగింతలు ఉత్సాహపరిచి కదం తొక్కుతున్న చంద్రబాబు పట్ల ఇంకెంతటి వీరాభిమానం వుండాలి. తమ నాయకుడు తప్పకుండా రాష్ట్ర ప్రజానీకానికి గొప్ప మేలు చేస్తాడన్ననమ్మకం కుదరాలేగాని వీరాభిమానానికి అంతుండదు, ఉత్సవాలు చేసుకుంటా రు, స్వీట్లు పంచుకుంటారు, వూరూరా భారీ ప్రచారానికి దిగుతారు. వీటికి దేనికీ నాయకుడినో, పార్టీ వర్గా లనో డబ్బులిమ్మని అడగరు.. వాళ్ల సొంత ఖర్చుతోనే అన్నీ చేస్తారు. దీన్ని పిచ్చనండి, మరేదయినా అనండి.. అసలు పేరు మాత్రం వీరాభిమానం. అదుగో అలాంటి వీరాభిమానం మరో పేరు కృష్ణ. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మళ్లీ అధి కారంలోకి రావాలని కలలు గనడమే కాదు, అది సాకారమయ్యే వరకూ గొప్ప కఠోర దీక్ష చేస్తున్నాడు. వీర తాడు వేసుకున్న కృష్ణ అందుకు ఒక వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నాడు. విజయవాడ కు చెందిన కృష్ణ అనే టీడీపీ కార్యకర్త ప్రజా చైతన్య సైకిల్ యాత్ర చేపట్టారు. విజయవాడ నుండి హిందూపురం వరకు చేపట్టిన సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం సంగంకి చేరాడు. సైకిల్ కి టీడీపీ జెండాలు కట్టుకుని.. ప్రత్యేకంగా బోర్డు లు ఏర్పాటు చేసుకుని యాత్ర చేస్తున్నాడు. దర్మపరిపాలన కావాలి టీడీపీ గెలవాలి అనే నినాదం తో యాత్ర చేపడుతున్నట్లు తెలిపాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ సైకిల్ యాత్ర కొనసాగిస్తానని పేర్కొన్నాడు. నాయకుడి కంటే వీరాభిమానే గొప్పవాడు, నాయకుని విజయానికి ఇలాంటి వీరాభిమాని కఠోర దీక్ష శక్తినిస్తుంది. ఈ శక్తి అపారమైనది. ఇలాంటి శక్తులు రాష్ట్రంలో ఎల్లవేళలా పార్టీకి కొత్త వూపిరినిచ్చి ముందడుగు వేయిస్తుంది. శభాష్ కృష్ణ! జయహో టిడీపీ! అన్నదే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల నినాదం అయ్యింది