విజయవాడ, జూలై 14,
ఏపీ మద్యం పాలసీలో వింత పోకడలకు పోతున్నారు. మద్యపాన నిషేధం గురించి ఉపన్యాసాలు ఇచ్చి తన స్వంత జె బ్రాండ్‌తో జనానికి మత్తెక్కించే విధానాన్ని అవలంబిస్తున్నారు.మత్తెక్కించడమే కాదు.. జనం జేబులు గుల్ల చేసి మరీ వారికి అనారోగ్యాన్ని బోనస్ గా ఇస్తున్నారు. అందరికీ అందుబాటులో వుండే ధరల్లో అందిస్తున్నామంటున్న మద్యంలో రసాయనాలు అనారోగ్య హేతువుగా మారి ప్రాణాంతకంగా మారాయని విమర్శలు రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్నాయి. పైగా, జబ్బులు, అనారోగ్యాలు జనాలకి, అమ్మకాలపై పన్ను సొమ్ము జగన్‌కి వెళుతోంది. ఈ అమ్మకాలపై ముప్ఫయి శాతం సాధారణ ఎక్సైజ్ పన్ను రూపేణా జగన్ జేబుల్లోకి అక్రమ మద్యం ఆదాయం వెళ్తోంది. కాబట్టే డిజిటల్ లావాదేవీలు పెట్టలేదని విపక్షాలు మండిపడుతున్నాయి.అయినా జగన్ పాలసీయే వేరు. అందులో మద్యం పాలసీ వెరీ స్పెషల్. జమా ఖర్చులు ఎందుకు జేబు నిండితే చాలన్నట్లుగా జగన్ మద్యం పాలసీ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా సీఎం పెడ చెవిన పెడుతున్నారు. మద్యపానం నిషేధించాలని గట్టి నిర్ణయం తీసుకున్నవారే మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని కోరుకుం టూ తమ తరఫున ప్రత్యేక బ్రాండ్లను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక అమ్మకాలు, దుకాణాలవల్ల ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతింటోందన్న విమర్శలు రాష్ట్ర మంతటా వినవస్తు న్నాయి. ఈ అమ్మకాలపై ముప్ఫయి శాతం సాధారణ ఎక్సైజ్ పన్ను రూపేణా జగన్ జేబుల్లోకి అక్రమ మద్యం ఆదా యం వెళ్తోంది. కాబట్టే డిజిటల్ లావాదేవీలు పెట్టలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. మద్యం ఆదాయ కుంభకోణంపై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్నామని టీడీపీ నేత డోలా బాల వీరాం జనేయ స్వామి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 30 శాతం సాధారణ ఎక్సైజ్ పన్ను రూపేణా జగన్ జేబుల్లోకి అక్రమ మద్యం ఆదాయం వెళ్తోంది కాబట్టే డిజిటల్ లావాదేవీలు పెట్ట లేదన్నారు.మద్యంలో విషపూరిత రసాయనాలు ఉన్నాయని తాము నివేదికలు విడుదల చేస్తే ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించట్లేదని ప్రశ్నించారు. అవసరం అయితే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వైసీపీ సర్కారు వచ్చిన తరువాతే రాష్ట్రంలో 106 మద్యం బ్రాండ్స్ వచ్చాయని డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. ఇదిలా వుండగా, కొత్త బార్ పాలసీ ద్వారా 800 బార్‌లకు రెండేళ్లు అనుమతించిన జగన్ రెడ్డి మద్య నిషేధం ఎలా చేస్తారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రశ్నించారు. బుధవారం మీడియా తో మాట్లాడుతూ, మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని తాము బయటపెట్టిన నివేదికపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.మద్యం తయారు చేయించేది జగన్, ప్యాపారం చేయించేది ప్రభుత్వం, అమ్మేది వైకాపా కార్యకర్తలు అని ఆరోపించారు. ముఖ్యమంత్రే మద్యం వ్యాపారం చేయటం ప్రజలు చేసుకున్న దుర దృష్టమన్నారు. ఎంపిక చేసుకున్న కొంతమంది బినామీలతో మద్యం వ్యాపారం చేయిస్తూ, ఆ డబ్బునే తిరిగి ఎన్నికల్లో ఖర్చు చేయనున్నారని తెలిపారు. మొబైల్ బెల్టుషాపులు పెట్టి మరీ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారని మండిపడ్డారు. దేశం మొత్తానికి మాదకద్రవ్యాల సరఫరా ఏపీ నుంచే జరుగుతోందన్నారు. వాటాల్లో తేడా లొచ్చేయి గనుకే కేసులు బయటకు వస్తున్నాయని ఏలూరు సాంబశివరావు పేర్కొన్నారు.