YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నిలువునా చీలిన మహావికాస్ అఘాడీ

నిలువునా చీలిన మహావికాస్ అఘాడీ

ముంబై, జూలై 14,
ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే పరిస్థితి. శివసేన ఎంపీల ఒత్తిడితో ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఉద్ధవ్‌ మద్దతు ప్రకటించక తప్పలేదు. అయితే ఉద్ధవ్‌ నిర్ణయంపై మహా వికాస్‌ అఘాడీ భాగస్వామి అయిన కాంగ్రెస్‌ సీరియస్‌ అయింది. శివసేనలో ఏక్‌నాథ్‌ షిండే వర్గం తిరుగుబాటుతో అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. షిండే సీఎంగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్కెచ్‌ వేసిన బీజేపీకి మద్దతు ఇవ్వడం ఏంటని శివసేనను ప్రశ్నిస్తోంది కాంగ్రెస్‌.
రాష్ట్రపతి ఎన్నికను సిద్ధాంతపరమైన పోరాటంగా చూడాలి. ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగం రక్షణ కోసం జరుగుతున్న యుద్ధంగా భావించాలి. మహిళలు-పురుషులని, గిరిజనులు-గిరిజనేతరులని చూడకూడదన్నారు మహారాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బాలాసాహెబ్‌ థోరత్‌. అయితే శివసేనకు మరో మిత్రపక్షమైన ఎన్సీపీ ఈ విషయంపై రియాక్ట్‌ అయింది. ముర్ముకు మద్దతు విషయంలపై ముందుగా శివసేనతో తమతో మాట్లాడలేదన్నారు ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌.అయినా సరే శివసేనతో పొత్తు కొనసాగాలని ఎన్సీపీ కోరుకుంటోందన్నారు. శివసేనకు చెందిన 19 ఎంపీల్లో 12 మంది ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని థాక్రేకు స్పష్టం చేశారు. దీంతో ముర్ముకు మద్దతు ప్రకటించక తప్పలేదు. సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండేతో పాటు అతని మద్దతుదారులైన నలుగురు ఎంపీలు శివసేన భేటీకి హాజరు కాలేదు. ఇప్పటికే రెబల్‌ సేన వల్ల అధికారం కోల్పోయిన ఉద్ధవ్‌ మిత్రుల కోపాన్ని ఫేస్‌ చేయాల్సి వస్తోంది.

Related Posts