రాజమండ్రి
భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం పెరు గుతోంది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది.రాజ మండ్రి వద్ద ఉగ్రరూ పం దాల్చింది.విలీన మండ లాల్లో 300 గ్రామాలకు రాకపో కలు నిలిచిపోయా యి.ఏపీ,తెలంగాణలో గ్రా మాలు గోదావరి వరద నీటిలో ముని గిపోయా యి.ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.బాధి తులను సురక్షిత ప్రాంతా లకు తరలిం చేందుకు అధికా రులు చర్యలు చేపట్టారు.కరెంట్ సర ఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తు న్న భారీ వర్షా లతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. రాజమండ్రి లోని పుష్ప ఘా ట్ వద్ద నీటి మట్టం 56 అడుగులకు చేరుకుంది.లంక గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువ న భద్రాచలంలో పరిస్థితి ప్రమాదక రంగా ఉంది. భద్రాచలంలో అర్ధరాత్రి ప్రవా హం 64 అడుగులకు చేరుకుం టుందని అధికారుల అంచనా..అదే జరిగి తే భద్రాచలం పరిధిలోనిపలు గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది.దీంతో అధికా రులు అప్రమత్తమ య్యా రు.ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్త మ య్యారు.గోదావరి వరదల కారణంగా సుమారు 2 లక్షల మంది ప్రభావిత మయ్యారు.