కడప
తెలుగు లాంగ్వేజ్ విద్యార్థులు ఆధునిక సాంకేతికను పొంది ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకునే లా తెలుగు భాషా ప్రయోగశాల ఉపయోగపడు తుందని యోగి వేమన విశ్వవిద్యాల యం ఉపకులపతి ఆచార్య మునగల సూర్య కళావతి అన్నారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఏర్పాటు చేసిన తెలుగు భాషా ప్రయోగశాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మునగల సూర్య కళావతి ప్రారంభించారు.ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ తెలుగు భాషా ప్రయోగశాలలో డిజిటల్ లాంగ్వేజ్ ని నేర్పించడం జరుగుతుందన్నారు. అలానే పత్రికల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యతను, విద్యార్థు లు స్వయంగా అవసరమైన మెటీరియల్ రూపకల్పన చేసుకునేలా తయారు చేస్తారన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలలో డేటా సైంటిస్ట్ గా లాంగ్వేజ్ లలో కూడా అవకాశాలు ఉన్నాయని వాటిని అందుకునేలా విద్యార్థులకు ఇక్కడ శిక్షణ ఇస్తారన్నారు. విద్యార్థులు ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా ల్యాబ్ ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆఫ్లైన్ , ఆన్లైన్ లో ఒకేసారి పాఠాలు బోధించడానికి అనువుగా ప్రయోగశాలను తయారు చేశామన్నారు.కుల సచివులు ఆచార్య డి.. విజయరాఘవ ప్రసాద్
మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా వై వి లో వై వి యు తెలుగుశాఖలో లాంగ్వేజ్ ల్యాబ్ ను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు చదువులతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి సూచించారు. వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. కృష్ణా రెడ్డి మాట్లాడుతూ సైన్స్ ల్యాబ్ లతోపాటు గా లాంగ్వేజ్ ల్యాబ్ లు ఏర్పాటు కావడం మంచి పరిణామం అన్నారు. విద్యార్థులు ఆధునిక ప్రపంచానికి అవసరమైన వనరుగా ఎదిగేలా శిక్షణ ను ఇస్తామన్నారు. ఆర్ట్స్ విభాగ డీన్ ఆచార్య తప్పెట రామ ప్రసాద్ రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలుగు శాఖ విద్యార్థులు ప్రయోగశాలను చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. వైవీయూ తెలుగు శాఖాధిపతి డా. ఎన్. ఈశ్వర రెడ్డి
ఎం. ఏ తెలుగు విద్యార్థులు, పిహెచ్. డి చేస్తున్న పరిశోధకులకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి యోగి వేమన విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టిందన్నారు. ల్యాబ్ ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు డాక్టర్ వై పి వెంకటసుబ్బయ్య, తెలుగు శాఖ సహ ఆచార్యులు డా.పి.రమాదేవి,ఆచార్యులు, సహ ఆచార్యులు, సంయుక్త ఆచార్యులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు