YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆగస్టు నెల 9 నుంచి ఆర్మీ సర్వీస్ శిక్షణ తరగతులు

ఆగస్టు నెల 9 నుంచి ఆర్మీ సర్వీస్  శిక్షణ తరగతులు

నెల్లూరు
ఆర్మీ సర్వీస్ లో చేరే యువకుల కోసం వచ్చే ఆగస్టు నెల 9వ తేదీ నుండి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అన్ని  ఏర్పాట్లుచేయాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.  బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ వారి క్యాంప్ కార్యాలయంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ ఆర్మీలో చేరే సువర్ణ అవకాశం అంటూ డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో రూపొందించిన  గోడపత్రాలను, కరపత్రాలను ఆవిష్కరించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్మీ సర్వీసులో చేరే యువకుల కోసం  నెల్లూరు నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ఆధ్వర్యంలో వచ్చే సెప్టెంబర్ మాసం 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించ బడుతుందన్నారు.  ఇందుకోసం అర్హులైన యువకులు వచ్చే ఆగస్టు మూడో తేదీలోగా వారి పేర్లను డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యు డాట్ జాయిన్ ఇన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ ఐ సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు.  ఈ విషయమై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.  జిల్లా నుంచి వీలైనంత ఎక్కువమంది యువకులు ఆర్మీకి ఎంపిక అయ్యేందుకు వీలుగా వారికి వచ్చే నెల 9వ తేదీ నుండి తగినంత శిక్షణ ఇచ్చి సుశిక్షితులుగా తీర్చిదిద్దాలన్నారు. ఎస్సీ ఎస్టీలు తదితర దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారు ఎంపిక అయ్యేలా కృషి చేయాలన్నారు.  
ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రీడా సంస్కృతి పెంపొందించేందు కోసం జగనన్న స్పోర్ట్స్ క్లబ్బులు ఏర్పాటు చేయాలని ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో ప్రజలకు  అవగాహన కల్పించాలన్నారు.  క్రీడల వలన  దేహదారుఢ్యంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చని తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసేందుకు కనీసం నెలకు ఒకసారి  టోర్నమెంట్లు నిర్వహించాలన్నారు.
జిల్లా స్థాయిలో సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహించి 14 రకాల క్రీడల్లో జిల్లా స్థాయి బృందాలను సిద్ధం చేయాలని వారిని రాష్ట్రస్థాయి సీఎం టోర్నమెంట్లకు పంపించవలసి ఉంటుందన్నారు. అలాగే నెలకోసారి  శాప్ లీగ్ టోర్నమెంట్లు జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు చర్యలు  చేపట్టాలన్నారు.  నెల్లూరు నగరంలోని ఏ సి ఎస్ ఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రాంతీయ స్పోర్ట్స్ అకాడమీ భవనం నిర్మాణం కోసం, మొగళ్లపాలెంలోని అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం నిధుల సమీకరణ చేయాలన్నారు.
ఈ సమావేశంలో సెట్నేల్ సీఈవో  డి. పుల్లయ్య, ఏఆర్ఏఎస్పి శ్రీనివాసరావు, డిఆర్డిఏ పిడి  సాంబశివరెడ్డి, డిపిఓ ధనలక్ష్మి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య, చీఫ్ కోచ్   యతిరాజు ,డీఎస్ ఏ పర్యవేక్షకులు విజయ్ కుమార్, కమిటీ సభ్యులు సెపక్ తక్రా అంతర్జాతీయ క్రీడాకారిణి ఉమా, బీచ్ కబడ్డీ క్రీడాకారుడు  సురేష్,  జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి  విజయ్ కుమార్, డీకే డబ్ల్యూ కళాశాల వ్యాయామ విద్య ఉపన్యాసకులు  విజయ కళ పాల్గొన్నారు.

Related Posts