YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఆరోగ్య‌క‌ర‌మైన చిన్నారుల్లో హెప‌టైటిస్ వ్యాధి: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

ఆరోగ్య‌క‌ర‌మైన చిన్నారుల్లో హెప‌టైటిస్ వ్యాధి: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

జెనీవా జూలై 14
ఆరోగ్య‌క‌ర‌మైన చిన్నారుల్లో హెప‌టైటిస్ వ్యాధి సోకుతున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామాల‌ను సునిశితంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తీవ్ర‌మైన రీతిలో హెప‌టైటిస్ వ్యాధి సోకిన వారిలో చాలా కేసుల్లో లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ జ‌రుగుతోంది.అయితే సుమారు 35 దేశాల్లో దాదాపు వెయ్యికిపైగా హైప‌టైటిస్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. హెప‌టైటిస్ వ్యాధి సోకుతున్న‌ట్లు ఏప్రిల్ 5వ తేదీన తొలిసారి డ‌బ్ల్యూహెచ్‌వో గుర్తించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు హెప‌టైటిస్ వ‌ల్ల 22 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. స‌గం కేసులు యూరోప్‌లోనే న‌మోదు అయిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డిస్తున్నారు.

Related Posts