YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సైబారాబాద్ పోలీసులకే ప్రమోషన్లు

 సైబారాబాద్ పోలీసులకే ప్రమోషన్లు

ఎన్నో సమస్యలతో ప్రాణాలను సైతం లెక్కచేకుండా విధులు నిర్వహిస్తున్న రక్షణభటులకు ఒక్కరోజైనా విశ్రాంతి ఉండటం లేదు. నిరంతరం ప్రజల రక్షణలో ఉంటున్న వీరి సమస్యలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోలీస్‌ సిబ్బంది సొంతింటి కల నిజం చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌ ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. సిబ్బంది మొత్తం ఒకేచోట ఉండేలా ప్రత్యేక కాలనీ మాదిరి ఏర్పాటు చేస్తామన్నారు. అనుకున్నదే తడవుగా జిల్లాల వారీగా అనువైన స్థలం గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పలు ప్రాంతాల్లో పోలీసులు స్థలాన్ని పరిశీలించడంతోపాటు మార్గదర్శకాలపై సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా కొద్దిరోజులు హడావుడి చేసిన ప్రభుత్వం మళ్లీ ఆ మాటే మరిచింది. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లల్లో పోలీస్‌ సిబ్బందికి కోటా కేటాయించి, వారికిచ్చిన హామీ నెరవేరుస్తామని తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అదీ ఆచరణ సాధ్యం కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కానిస్టేబుళ్లు కోరుతున్నారు.ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రమో షన్లు, వారాంతపు సెలవులకు దిక్కులేదు. ఎన్నోఏండ్లుగా పనిచేసినా కానిస్టేబుళ్లకు ప్రమోషన్‌ లభించడం లేదు. ఇతర శాఖలో ఎనిమిదేండ్లకే ప్రమోషన్లు లభిస్తుండగా పోలీస్‌శాఖలో మాత్రం ప్రమోషన్లు ఉండటం లేదు. కాని స్టేబుళ్లకు దాదాపు 27 ఏళ్లయినా ఉద్యోగోన్నతుల మాటే లేదు. ఒక్క సైబరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరి స్థితి. పోలీసులకూ వారాంతపు సెలవులు, ప్రమోషన్లు కల్పి స్తామన్న సీఎం హామీలకు నాలుగేండ్లయినా అతీగతీ లేదు. మరోవైపు సిబ్బంది కొరతతో ఉన్నవారిపై పనిభారం పడుతోంది.పోలీస్‌ అంటేనే ప్రజలకు కొండంత అండ. ఏ ఆపదొచ్చినా ముందుగా ఆశ్రయించేది పోలీసులనే. వారు 24 గంటలు పనిచేస్తారు. పండుగైనా, చావైనా, ధర్నా అయినా విధుల్లో ఉంటారు.ఎస్‌ఐలకు గెజిటెడ్‌ హోదా కల్పిస్తామని (2005లో 8వ పీఆర్‌సీలో నిర్ణయం తీసుకున్నా) చెప్పిన ముఖ్యమంత్రి ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. సీనియర్లకు ప్రయోషన్లు లేకపోవడం, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడంతో జూనియర్‌, సీనియర్లు ఒకే రకమైన వేతనం పొందుతున్నారు. 2005 నాటికి ఉన్న సిబ్బందితోపాటు ఐదేండ్ల సీనియారిటీ కలిగిన ప్రతి ఒక్కరికీ ఒక ఇంక్రిమెంట్‌ చొప్పున 20 ఏండ్ల సర్వీసున్న వారికి నాలుగు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాల్సి ఉంది. కానీ సర్వీస్‌ మొత్తంలో నాలుగు ఇంక్రిమెంట్లు ఇచ్చేలా చర్య లు తీసుకున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది సిబ్బందితో కూడిన పోలీస్‌ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే, కిందిస్థాయి సిబ్బంది సమస్యలను పరిశీలించి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోం సెక్రెటరీ, డీజీపీతోపాటు ఇంటలిజెన్స్‌ చీఫ్‌లకు వినతిపత్రాలు సమర్పించామన్నారు. సమావేశానికి తమను ఆహ్వానిస్తే పలు సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకుపోతామని చెప్పారు

Related Posts