YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అడుగడుగునా గోయ్యి...

అడుగడుగునా గోయ్యి...

గుంటూరు, జూలై 15,
ఆంధ్రప్రదేశ్ రోడ్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోలేదు..పొరుగు రాష్ట్రం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు. అన్నీ అబద్ధాలు, అసత్య ప్రచారాలంటూ దుమ్మెత్తి పోశారు. పైపెచ్చు వారం వారం రోడ్ల పరిస్థితిపై జగన్ సమీక్షలు నిర్వహించారు. అద్దాల్లాంటి రోడ్లు.. సాఫీ ప్రయాణం అంటూ గప్పాలు కొట్టుకున్నారు.నాలుగు రోజులు వానలు పడ్డాయో లేదో ఏపీలో రోడ్ల బండారం బయట పడిపోయింది. ఈ మూడేళ్లలో చిన్న గుంత కూడా పూడ్చలేదని రుజువై పోయింది. ఇటీవలే చేసిన సమీక్షలో జూలై 15 నాటికి రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండదని జగన్ ఆర్భాటంగా ప్రకటన కూడా చేశారు. నిజమే కాబోలు అనుకునే వారికి దిమ్మ తిరిగేలా వాస్తవ పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన జూలై 15 వచ్చేసింది. నిజమే రోడ్లపై ఒక్క గుంత లేదు. బోలెడు గుంతలు ఉన్నాయి. ఇంచుమించు అడుగుకో గుంత ఉందంటే అతిశయోక్తి కాదు.  వర్షాలకు ఆ గుంతలు ఈత కొలనులను తలపిస్తున్నాయి. దాదాపు అన్ని పట్టణాలు, నగరాలు, పల్లెల్లో రోడ్ల పరిస్థితి ఇదే. ఎవరైనా హఠాత్తుగా చూస్తే ఇక్కడ రోడ్డేది.. అన్నీ నీటి కొలనులేగా అంటారు. ఆ గంతల రోడ్లపైనే, ఈ నీటి తటాకాల్లోనే అత్యంత ప్రమాకర పరిస్థితుల్లో వాహనదారులు ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్లా..ఈత కొలనులా అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఏపీలో రోడ్ల దుస్థితిపై ఫొటోలు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. పోనీ ఇప్పుడైనా జగన్ సర్కార్ ఈ రోడ్ల మరమ్మతులు చేపడుతుందా అంటే ఆ అవకాశమే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.  దీంతో పనులు చేయిద్దామని ప్రభుత్వం ఒక వేళ పొరబాటున అనుకున్నా.. చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఏపీలో ఉంది. వైసీపీ నేతలే ప్రభుత్వ కాంట్రాక్టులా అయ్యబాబోయ్ అని పారిపోతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏపీ రోడ్లను ‘ఏ దేవుడూ’ బాగు చేయలేడు.
గోతుల మధ్య రోడ్లు వెతుక్కోవాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోతుల మధ్య రోడ్డును వెదుక్కోవల్సిన పరిస్థితి వస్తోందని మండిపడ్డారు. రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయని విమర్శించారు. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులు చేయాలనే బాధ్యతను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆక్షేపించారు. వారి బాధ్యత గుర్తు చేయాలనే ఉద్దేశ్యంతో #GoodMorningCMSir అనే హాష్ ట్యాగ్ తో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోందని వెల్లడించారు. జులై15 నాటికి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసి, ప్రతిపక్షాల నోరు మూయిస్తామన్న సీఎం జగన్.. ఆ ఛాలెంజ్ ను స్వీకరించి రోడ్లను బాగు చేయాలని సూచించారు. ఆర్ అండ్ బీ పరిధిలో స్టేట్ హైవేలు 14,722 కి.మీ, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 32,240 కి.మీ, ఇతర రోడ్లు 6,100 కి.మీ ఉన్నాయి. ముఖ్యంగా 9,222 కి.మీ పంచాయతీ రోడ్లకు మరమ్మతుల కోసం రూ.1,072 కోట్లు కేటాయించామని ప్రభుత్వం ఏప్రిల్ లో ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరో రకంగా ఉంది. రోడ్లపై పందులు స్వైర విహారం చేస్తున్నాయని పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఏటా కనీసం 8 వేల కి.మీ రోడ్లు మెయింటినెన్స్, మరమ్మతుల పనులు చేయాలి. ఇందుకోసం దాదాపు రూ.1500 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇది కాకుండా పీరియాడికల్ మెయింటినెన్స్, రిపేర్లు చేయాలి. ఇందుకోసం మరో రూ.500 కోట్లు అదనంగా అవసరం ఉంటుంది. ఈ మూడేళ్లలో మెయింటినెన్స్, మరమ్మతు పనులు చేయకపోవడంతో రహదారులు చాలా వరకు దెబ్బతిన్నాయి. 30 వేల కి.మీ మేర రోడ్లు కనీస మరమ్మతులకు నోచుకోలేక గుంతలమయంగా మారింది. మూడేళ్లుగా పట్టించుకోకపోవడంతో చాలా వరకు కొత్తగా రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉంది. మరమ్మతులకే నిధులు లేక రోడ్లను గాలికొదిలేసిన ప్రభుత్వం.. కొత్త రోడ్లు వేయడం అంటే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులరీత్యా అసాధ్యమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు కనీస మరమ్మతులు చేసి ప్రయాణానికి అనువుగా మార్చాలి. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. రోడ్లు నిర్వహణ కోసం అని పెట్రో సెస్ వసూలు చేస్తున్నారు. ఇది రూ.750 కోట్ల మేర ఏటా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి.అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తే సరిపోదన్న జనసేనాని.. రోడ్లు అవసరం లేదనే ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఎద్దేవా చేశారు.మీ ఊళ్లో, మీ చుట్టు పక్కల రోడ్లు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో.. ఆ రోడ్డు మీద వెళ్లేందుకు ఎంత ప్రయాస పడాల్సి వస్తోంది అని చెప్పే ఫోటోలు, వీడియోలు తీయండి. వాటిని #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయండి. ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో నేను కూడా పాల్గొంటాను. మీరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని పవన్ కల్యాణ్ పిలువునిచ్చారు.

Related Posts