తిరుపతి, జూలై 15, రాజకీయాల్లోకి మహిళలు మరింత ఉత్సాహంగా వస్తుండడంతో చాలా కాలం నుంచీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పని పోటీ బాగానే సాగుతోంది. ప్రతీ ఒక్కరికీ తమ నాయకుని, సీఎం చేత శభాష్ అనిపించుకోవాలన్న ఆతృత వుంది. కాబోతే కొందరు నిదానం ప్రధానం, మరి కొందరు ర్యాకెట్ వేగం, ఇంకొందరు పరిస్థితులను అనుసరించి నడచుకోవడం చూస్తున్నాం. మంత్రిమండలిలో ఒక్కరి ద్దరు మంత్రులు తప్ప మగవారిలో చాలామంది పనితీరుపట్ల ఇప్పటికే ముఖ్యమంత్రి చిందులు తొక్కుతున్నారు. కానీ ఆ సంగతి బయటికి తెలియనీయడం లేదు. అది గ్రహించుకున్నవారు కాస్తంత జాగ్రత్తపడే పనిలో వున్నారు. ఈ దశలో జగన్ క్యాబినెట్‌లోని మహిళా మంత్రులు పరిస్థితులను తమకు అనుకూలం చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఒకరితో ఒకరు పోటీపడుతూ జగనన్నతో శభాష్ అనిపించుకోవాలని రెండింతలు ఉత్సాహంప్రదర్శిస్తున్నారు. వైయస్ జగన్ మలి కేబినెట్‌లో నలుగురంటే నలుగురు మహిలు ఉన్నారు. వారిలో మంత్రులుగా ఆర్కే రోజా, విడదల రజినీలు మాత్రం కుందేళ్లులాగా దూసుకుపోతున్నారనే టాక్ అయితే వెలగపూడి సచి వాలయం సాక్షిగా హాట్ హాట్‌గా నడుస్తోందట. ఇక మిగిలిన ఇద్దరు తానేటి వనిత, ఉష శ్రీ చరణ్‌లు మాత్రం తాబేళ్లతో పోటీ పడిపోతున్నారట. అయితే వీరిలో తానేటి వనిత జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు. మలి కేబినెట్‌లో సైతం చోటు దక్కించుకొని అదీ కూడా సీఎం తర్వాత పోస్ట్ అంటే హోం మంత్రి గా పెద్ద ఛాన్స్ కొట్టేసిందని ఫ్యాన్ పార్టీలోని మహామహులు సైతం ఆవిడ ఆదృష్టం చూసి ఈర్ష్య చెందుతో న్నారనే టాక్ . కానీ ఆమె తన శాఖపై ఇప్పటికీ పట్టు సాధించలేదనే చర్చ సచివాలయంలో సాగుతోంద ట. ఇక మరో మంత్రి ఉషా శ్రీచరణ్ పరిస్థితి కూడా దాదాపుగా అదే తీరులా ఉందట.మరోవైపు వీరి మంత్రివర్గ సహచరులు విడదల రజినీ, ఆర్కే రోజాలు నువ్వా, నేనా అనే టైప్‌లో మంత్రు లుగా సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో తరచు వీరిద్దరు సమీక్ష సమా వేశాలు సైతం నిర్వహిస్తున్నారట. అయితే ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వీరిద్దరు వెంటనే స్పంది స్తున్నారని, అలాగే పార్టీ తరఫున సైతం తమదైన శైలిలో వాయిస్ వినిపించేస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో వున్నట్టు వార్త. ఇక ప్రతిపక్ష పార్టీల నేతల కామెంట్స్‌పై వీరిద్దరు నాని బ్రదర్స్ అంతగా కాకుండా ఆచితూచి మాట్లా డుతూ కౌంటర్లు ఇస్తున్నారని అయితే ఈ విషయంలో మంత్రి రజినీని ఆర్కే రోజా ఓవర్ టేక్ చేసే సిందని ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం వారే గుర్తు చేస్తున్నారట. వీళ్లీద్దరు ఇంత క్రమశిక్షణ కలిగిన వారిలాగా ఇంత పొందికగా, మంత్రులుగా తమ పని తాము చేసుకోంటూ, పోటా పోటీగా దూసుకు పోవడం చూసి వెలగపూడి సచివాలయంలోని సిబ్బంది సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.అయితే వీరి ఇంతలా క్రమశిక్షణగా మెలగడం వెనుక పెద్ద కథే ఉందనే ఓ చర్చ అయితే సదరు సచి వులు కొలువు దీరిన సచివాలయంలో నడుస్తోందట. తానేటి వనిత, ఆర్కే రోజా, విడదల రజినీలు ముగ్గు రు గతంలో టీడీపీలో సైకిల్ సవారీ చేసిన వారే. అయితే ఆర్కే రోజా 2014, 2019 లో జగన్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచింది. 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెకు మాత్రం ఏపీఐఐసీ చైర్మన్ పదవిని సీఎం జగన్ కట్టబెట్టారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ జగన్ మలి కేబినెట్‌లో ఆమె పర్యాటక శాఖతోపాటు పలు కీలక శాఖల మంత్రిగా ఛాన్స్ కొట్టేసి దూసుకుపోతున్నారు. అయితే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో ఆమెకు అసమ్మతి సెగ అలా ఇలా కాదు గట్టిగానే ఉంది. అందుకు ఆమె రెండో సారి ఎమ్మెల్యే అయి మంత్రిగా పదవి చేపట్టే వరకు అంటే దాదాపు మూడేళ్ల పాటు.. ఆమె నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామా లు అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఆమె నియోజకవర్గంలోని దాదాపు 80 శాతం మంది లీడర్ నుంచి కేడర్ వరకు అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలోకి వెళ్లి చిక్కుకుపోయింది.ఆ క్రమంలో నగరి నియోజకవర్గంలో అసమ్మతి సెగను ఆర్కే రోజా ఒకానొక సమయంలో తట్టుకోలేక తాడే పల్లి ప్యాలెస్ తలుపు సైతం తట్టిందని.. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డిని ప్యాలెస్‌లోని పెద్దలంతా కూల్ చేశా రని సమాచారం. అనంతరం ఆర్కే రోజాకి మంత్రిగిరి వచ్చి ఆమె ఓళ్లోకి వాలిందని.. అందుకే ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేరుగా తన రాజకీయ ప్రత్యర్థి మరో మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు నమస్కారం చేసిందనే ఓ టాక్ అయితే నగరి నియోజకవర్గంలో నేటికి ఉంది. అయితే వచ్చే ఎన్ని కల్లో మళ్లీ గెలుపు అంత సులువు కాదని.. ఈ నేపథ్యంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుం టూ ముందుకు సాగితేనే.. ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యేగా గెలుపొందుతామనే ఆలోచనలో రోజా ఉన్నట్లు ఆమె వర్గం పేర్కొంటోందట. మరో మంత్రి విడదల రజినీ. ఈమెగారి బుర్ర పాదరసం టైప్ అని ఇప్పటికే సచివాలయంలో గుస గుసలు మొదలైనాయట. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. ఎక్కడ, ఎప్పుడు, ఎలా దూసు కుపోవాలి అప్పటి కప్పుడు నిర్ణయం తీసుకుని మరీ దూసుకుపోతోందట. దీంతో మంత్రి రజినీ అంత ర్యం ఆమె వెంట ఉండే సిబ్బందికే సైతం అంతగా అంతుబట్టదనే ఓ టాక్ అయితే సచివాలయంలో నడుస్తోంది.ఇక వైద్య ఆరోగ్య శాఖ అంటేనే అత్యంత కీలక శాఖ.. అలాంటిది 32 ఏళ్లకే రజని మంత్రిగిరి కొట్టేసిందనే ఓ భావన ఇప్పటికే ఫ్యాన్ పార్టీలో తలపండిన నేతల్లోనే కాదు.. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నేతల్లో సైతం గట్టిగానే ఉందట. ఈ విషయాన్ని పసిగట్టిన ఈ మాజీ సాప్ట్‌వేర్ ఇంజినీర్ ప్లస్ ప్రస్తుత మంత్రిగారు.. తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా ఉం టూనే తన పార్టీలోని అదీ తన సొంత నియోజకవర్గంలోని అసమ్మతి నేతలను తన వర్గంలోకి తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో, ఎలా చేయాలో అంత సైలెంట్‌గా చేస్తుందని సమాచారం.తన నియోజవకర్గంలోని ప్రజల్లో వైయస్ జగన్ ప్రభుత్వంపై అసమ్మతి ఉన్నా, ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉన్నా తాను మాత్రం మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఓ రీతిలో ఆమె చాలా పకడ్బందీగా పావులు కదుపు తోన్నట్లు సమాచారం. ఏదీ ఏమైనా ఫ్యాన్ పార్టీలో నలుగురు మహిళా మంత్రులు ఉన్నా, వారిలో ఇద్దరు సైలెంట్‌గా ఉంటే.. మరోద్దరు మాత్రం తమ పనితనంలో మరీ దూకుడుగా దూసుకుపోతున్నారనే మాట సచివాలయం సాక్షిగా వినపడుతోంది.ఇక్కడ మొత్తంమీద గమనించాల్సిందేమంటే, ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి, జగన్ పరువు ను కాపాడేందుకు పాటుపడుతున్న ఇద్దరు మహిళా రత్నాలు..రజనీ, రోజాలు ఇద్దరూ తెలుగు దేశం పార్టీ నుంచి వైసీపీలోకి దూకినవారే కావడం గమనార్హం