YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

అయిదేళ్లలో రెండింతలైన కోడి ధరలు

అయిదేళ్లలో రెండింతలైన కోడి ధరలు

వేసవికాలంలో కోడి మాంసం, గుడ్డు ధరలు తగ్గుతాయని అందరూ అనుకొంటారు.. ప్రస్తుతం మార్కెటులో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.  అయిదేళ్ల క్రితం కిలో మాంసం రూ.వందకు అటూ ఇటూ ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. ఈ ధరలు ఇంకా పెరగవచ్చని అభిప్రాయపడ్డారుజాన్‌ నెల కూడా మొదలుకావటంతో కోడికూర ధరలు పెరిగాయంటున్నారు. మామూలుగా ఎండాకాలంలో కోళ్ల ఉత్పత్తులను రైతులు, వ్యాపార సంస్థలవారు తగ్గిస్తారు. మండే ఎండలకు కోళ్లు చనిపోతాయని ఫారాల్లో దాదాపు 40 - 50 రోజుల వరకు కోళ్లపెంపకం జోలికి వెళ్లరు. ఒకవేళ పెంచినా.. అత్యధిక ఉష్ణోగ్రత ధాటికి అవి ఎప్పుడు చనిపోతాయో తెలియని పరిస్థితి. అక్కడక్కడా కొందరు రైతులు మాత్రమే వీటిని పెంచుతున్నారు.కిలో కోడి మాంసం రూ.220 పలుకుతోంది. ఒక్కో గుడ్డు చిల్లరధర గరిష్ఠంగా రూ.5 ఉంది. వారం పది రోజుల క్రితం రూ.180 ఉన్న కోడికూర ఇప్పుడు అమాంతం రూ.40 మేర పెరిగింది. గత నాలుగైదేళ్లుగా ఈ సీజనులో ఎప్పుడూ ఇంత ధర పెట్టి వినియోగదారులు కోడికూరను కొనుగోలు చేయలేదు. రం ఒకప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు రెండు కోట్ల కోళ్లను పెంచేవారు. ఇప్పుడు 60 - 70 లక్షలు తగ్గిపోయాయి. పెంపకంలో సరైన మెళకువలు పాటించకపోవటం.. ఏటా పెరుగుతున్న విపరీతమైన ఉష్ణోగ్రతలతో వేసవి వేడికి కోళ్లు ఎక్కువగా మృతిచెందటం వంటి అనేక కారణలతో రైతులు ఈ రంగానికి దూరమవుతున్నారు. పైగా మార్కెటులో రైతులు నేరుగా అమ్మే పరిస్థితీ లేదు. ఆర్థికంగా భారంగా మారిన అధిక ఖర్చులతో చాలామంది కోళ్ల పెంపకాన్ని వదులుకున్నారు. ఇదే అదనుగా పేరున్న కొన్ని కంపెనీలు మార్కెటును హస్తగతం చేసుకున్నాయి. ఉత్పత్తులు పరిమితంగా ఉంటుండటం వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయని పశుసంవర్థకశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రైతులు ఎక్కడా కోళ్లను పెంచటం లేదన్నారు. కంపెనీలే కోళ్లను పెంచటం వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయన్నారు..రంగారెడ్డి జిల్లాలో కోళ్లపెంపకం ఎక్కువ. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 130 - 140 లక్షల కోళ్లను మాత్రమే పెంచుతున్నారు. వీటినీ రైతుల సాయంతో కంపెనీలే పెంచుతున్నాయి. అంటే.. రైతులు కేవలం కోళ్లఫారాలను ఏర్పాటు చేసుకొని కంపెనీలు ఇచ్చిన కోడిపిల్లలను పెంచేందుకే పరిమితం అవుతున్నారు. వారు ఎన్ని పిల్లలు ఇస్తే అన్ని పిల్లలను పెంచి కిలోల చొప్పున కంపెనీలకు తిరిగి ఇస్తున్నారు.ఈ విధానంతో కోళ్లపెంపకం రైతుల చేతుల నుంచి పూర్తిగా కంపెనీల చేతుల్లోకి వెళ్లింది. రైతులు బినామీలుగా మారారు. అయిదేళ్ల కిందటిదాకా కూడా రైతులు స్వయంగా కోళ్లను పెంచి మార్కెటుకు తరలించేవారు. ఇప్పుడా పరిస్థితి దాదాపు లేదు. ఖర్చులు ఎక్కువ అవుతాయని.. ఎందుకొచ్చిన గొడవంటూ రైతులు ఎవరూ స్వయంగా కోళ్లను పెంచి మార్కెటుకు తీసుకురావటం లేదు. పౌల్ట్రీ రంగంలో పేరున్న పెద్ద కంపెనీలే కోడిపిల్లలను రైతులకు ఇచ్చి పెంచిన తర్వాత మళ్లీ కొనుగోలు చేస్తున్నాయి. 

Related Posts