YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాలూకు మరో ఐదేళ్ళ జైలు శిక్ష..

లాలూకు  మరో ఐదేళ్ళ జైలు శిక్ష..

బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతో పాటు మరో 48 మంది  దోషులు

రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు  నిర్ధారణ

దాణా కుంభకోణానికి చెందిన మరో కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో ఐదేళ్ళ జైలు శిక్ష పడింది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతో పాటు మరో 48 మందిని రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. దాణా కుంభకోణానికి చెందిన మూడవ కేసు (దియోగఢ్ ట్రెజరీ నుంచి ఎనభై లక్షల రూపాయలు డ్రా చేసిన కేసు)లో ఇప్పుడు లాలూకు శిక్షపడింది. 1992-93లో ప్రస్తుతం జార్ఖండ్‌లోని చెయిబాసా జిల్లా ఖజానా నుంచి 33.67 కోట్లు డ్రా చేసిన రెండవ కేసులో మూడున్నరేళ్లు శిక్షపడి లాలూ ఇప్పటికే జైల్లో ఉ న్నారు. నరేంద్రమోదీని గద్దె దించేవరకూ విశ్రమించేదిలేదన్న లాలూను కో టానుకోట్ల రూపాయల దాణా కుంభకోణం కేసులు వెంటాడుతుండడంలో మర్మం సర్వవిదితమే.

బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే యోచిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల కూటమిలో కీలక సూత్రధారిగా ఉన్న లాలూకు అధికార పక్షం జైలు శిక్షలు విధిస్తున్నదన్న విమర్శలూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలకలా ఉన్న సీబీఐను, న్యాయవ్యవస్థను విని యోగించుకొని ప్రతిపక్షాలను మోదీ ఇబ్బంది పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. శశికళ, లాలూలకు జైలుశిక్షలు, డిఎంకె సభ్యులు కణిమొళి, ఎ.రాజా,  కరుణానిధి అమ్మాళ్ నిర్దోషులుగా తీర్పు రావడంపై అనేక సందే హాలు వ్యక్త మవుతున్న నేపథ్యంలో లాలూపై సీబీఐ కోర్టు మరో శిక్ష విధించింది. పై కోర్టుల్లో తేల్చుకునేందుకు లాలూ ప్రయత్నాలు ఏమేరకు ఫలి స్తాయో సందేహమే. దాణా కుంభకోణం కేసుల్లో పీకల్లోతు కూరుకు పోయిన లాలూ కీలక తరుణంలో జైల్లోనే ఉండిపోవాల్సి రావడం ప్రతిపక్ష కూటమికి పెద్ద దెబ్బ తగిలినట్ల్లే. బిహార్ కరువులో మేత లేక పశువులు కన్నుమూస్తున్న నేపథ్యంలో, కేంద్రప్రభుత్వ సహకారంతో ఆరంభించిన పశువుల దాణా పథకాన్ని ఉన్నతాధికారులు, నాయకులు కలసికట్టుగా నిధులను దారి మళ్లించి స్వాహా చేశారు. పశు సంవర్థక శాఖ నిధులను ఆరు ట్రెజరీల నుంచి అక్రమంగా  ఉపసంహరించిన కుంభకోణాన్ని కాగ్ బయట పెట్టడంతో యావత్తు దేశం విస్తుపోయింది. ప్రస్తుత బిహార్ ఉప ముఖ్య మంత్రి సుశీల్ కుమార్ మోదీ, మరికొందరు దాణా కుంభకోణంపై హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో లాలూ ఆర్థిక అక్రమాలను సీబీఐ బయట పెట్టింది. విడివిడిగా నిధుల ఉపసంహరణ జరిపితే ఒక్కటే కుంభకోణం కింద విచారణ చేయ డంపై లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. కుంభ కోణం ఒక్కటే అయినా, ప్రతి వ్యక్తిగత కేసును విచారించి విడి విడిగా శిక్షలు వేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో లాలూపై శిక్షల పర్వం నడుస్తోంది.

ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో జయప్రకాశ్ నారాయణ అనుచరుడిగా ఉద్యమించిన లాలూ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే స్థాయికి ఎదిగారు. కుమార్తె రాజ్యసభ సభ్యురాలిగా, ఇద్దరు కుమారులు శాసన సభ్యులుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ బిహార్ ప్రతిపక్ష కూటమికి లాలూ ప్రత్యక్ష సారథ్యం లేకపోవడం తీరని లోటే. బిహార్ రాజకీయ పరిణా మాల్లో నితీశ్ కుమార్‌తో కలసి బలమైన యాదవ్ ఓటు బ్యాంకుతో అధిక స్థానాల్లో లాలూ నెగ్గుకొచ్చి తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే మోదీ- అమిత్‌షా చాణక్యంతో లాలూ-నితీశ్‌ల మైత్రి చెడిపోయింది. అస్తిత్వాన్ని కాపా డుకునేందుకు నితీశ్‌కుమార్ బీజేపీ శరణుజొచ్చవలసిన పరిస్థితి ఏర్పడింది. బిహార్‌లో ఎప్పటినుంచో పాగావేసేందుకు ఎదురుచూస్తున్న బీజేపీకి లాలూపై నడుస్తున్న దాణా కుంభకోణం కేసుపై సీబీఐ కోర్టు విచారణ మార్గం సుగమం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిహార్ ప్రతిపక్షాలను ఏకంచేసిన ‘మహాగడ్బంధన్’ సృష్టికర్త లాలూ జైల్లో మగ్గుతుండడం బీజేపీకి అందివచ్చిన అవకాశం. అధికార కూటమిని ఎదిరించగల శక్తి, సమర్థత ఉన్న లాలూపై రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టుల కేసులు, కేంద్ర నిఘా సంస్థలు ఆయన కుటుంబంపై కుట్రపూరితంగా దాడులు చేస్తున్నాయన్న ఆరోపణల్లో తప్పుపట్టలేకపోవచ్చు. దేశంలోనూ, బిహార్‌లోనూ కీలక రాజకీయ పరిణా మాలు సంభవిస్తున్న తరుణంలో బలమైన ప్రతిపక్షమే లేకుండా తుడిచి పెట్టుకుపోయే పరిస్థితికీ,  తన రాజకీయ భవిష్యత్ శూన్యంగా మారడానికీ లాలూ స్వయంకృత అపరాధమే ప్రధాన కారణం.

Related Posts