YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లోసిఎం జగన్ ఏరియల్‌ సర్వే

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లోసిఎం జగన్ ఏరియల్‌ సర్వే

అమరావతి జూలై 15
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. ఏరియల్‌ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్‌ సమీక్షించనున్నారు. విశాఖపట్నంలో వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బయలుదేరారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం.. ఏరియల్ సర్వే నిర్వహించారు.అనంతరం వరదలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీచేశారు. ఇక గురువారం ఉదయం నాటి గోదావరి వరద పరిస్థితి గురించి సీఎం ఇరిగేషన్‌ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌ సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్లు వారు వివరించారు. దాదాపు 23 నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముందన్నారు.ఆ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని.. అలాగే, వారికి తగిన సౌకర్యాలను కల్పించాలన్నారు.  

Related Posts