విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో భూగర్భ గనులశాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సోమవారం నాడు పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా పెద్దగెడ్డ ప్రాజెక్టు సాగునీటి కాల్వలను పరిశీలించారు. తరువాత కాకర్ల వలస, కొండకెంగువ అక్విడెక్ట్ ల సమీపంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్విడెక్ట్ ల నిర్వహణ సరిగలేదని అధికారులకు పలు సూచనలు చేసారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. పెద్దగెడ్డ ప్రాజెక్టును జైకా నిధులతో ఆధునికరిస్తాం. చివరి ఆయకట్టు ప్రతి భూమికి సాగునీరు అందేంచేందుకు చర్యలు చేపడుతున్నాoమని అన్నారు. సాగునీటికి అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏడొంపుల గెడ్డపై దృష్టి సారించాం. కాల్వల్లో పూడికతీత పనులు అధికారులు చేపట్టారు. అశ్రద్ధ వహిస్తే సహించేదిలేదని అన్నారు. రామభద్రపురం మండలంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందించిన తర్వాత బాడంగి మండలానికి సాగునీటిని అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.