YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు

ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు

విజయవాడ జూలై 16,
రానున్న ఎన్నికలు చంద్రబాబు చివరి ప్రయత్నమనే చెప్పాలి. ఎటువంటి ప్రయోగాలు చేయలేని పరిస్థితి. కేవలం చంద్రబాబు ఇమేజ్ పైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ప్రజల్లో ఎంత మేరకు గ్రాఫ్ ఉందనేది తెలియదు. చేయించుకుంటున్న సర్వేలు నమ్మడానికి వీలులేదు. సభలకు వస్తున్న జనాలను చూసి సంబరపడితే సరిపోదు. ఆ సంగతి నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు. తనకు వస్తున్న నివేదికలన్నీ సరైనవు కావని తెలుసు. వీటిని నమ్ముకుని ఒంటరిగా బరిలోకి దిగితే బూమ్‌రాంగ్ అవుతుందేమోనన్న భయం అందుకే చంద్రబాబు నిత్యం ఫ్రస్టేషన్ లోనే ఉన్నట్లు కన్పిస్తుంది. ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఒంటరిగా పోటీ చేయలేరు. అలాగని పొత్తుల కోసం తాపత్రయపడితే అవతలి పక్షం నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుందన్నది తెలియదు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితి తెలుగుదేశం పార్టీది. 2004, 2009 ఎన్నికల్లో వరసగా ఓటమి పాలయినా పార్టీ పరిస్థితి 2014లో ఇంత దీనంగా అయితే లేదు. కానీ 2019 ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. పొత్తుల కోసం.... దీనివల్లనే తాను మిత్రపక్షాలు అనుకుంటున్న వారు సయితం కాలరెగరేసే పరిస్థితికి వచ్చారు. పొత్తులకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రానురాను ఆ పార్టీలు కూడా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అప్పుడు వారి డిమాండ్లకు తలొగ్గాల్సి ఉంటుంది. సీట్ల సంఖ్యలోనూ, మరేదైనా "ముఖ్య"మైన అంశంమైనా చివరి సమయంలో పట్టుబడితే అసలుకే ఎసరు వస్తుంది. తమ సామాజికవర్గం నేతను చంద్రబాబు కాదన్నారని ఆ వర్గం పూర్తిగా దూరమయ్యే అవకాశముంది. అలాగని పట్టువిడుపులకు పోలేదని పరిస్థితి టీడీపీ అధినేతది.

Related Posts