YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వర్షపాతం లేకున్నా భూగర్భజలాలు పెంచాం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

వర్షపాతం లేకున్నా భూగర్భజలాలు పెంచాం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు నీరు-ప్రగతి, వ్యవసాయంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ఇబ్బందుల్లో కూడా వ్యవసాయంలో 17% వృద్ధి సాధించామని, భూసారంలో సూక్ష్మ పోషకాల సమతుల్యత ఉండాలని చంద్రబాబు సూచించారు. బోరాన్, పాస్పరస్ హెచ్చుతగ్గులు లేకుండా చూడాలని, జీబా వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. 30 శాతం వర్షపాతం లోటు ఉన్నా 34 మీటర్ల భూగర్భజలాలు పెంచామని సీఎం  అన్నారు. నీరుప్రగతి, జల సంరక్షణ ఉద్యమాలే భూగర్భ జలాల పెంపునకు కారణమన్నారు. ఓడీఎఫ్ ప్లస్లో కూడా మన రాష్ట్రమే ముందంజలో ఉండాలని అన్నారు. కర్నూలు, కడపలో ఉపాధి కూలీల సంఖ్య మరింత పెరగాలన్నారు. ఈ ఏడాది రూ.10వేల కోట్ల నరేగా నిధుల లక్ష్యం చేరాలన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,82,014 ఇళ్లు పూర్తి చేశామని, ఏప్రిల్ నెలలో గతేడాదికన్నా రెట్టింపు ఇళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతం కావాలన్నారు. 19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. వేసవిలో వడగాల్పులు పెరిగే అవకాశం ఉందన్నారు. చెరువులు, కాల్వలు, జలాశయాల్లో నీటినిల్వలు పెంచాలన్నారు. పచ్చదనం, తుంపర సేద్యం ద్వారా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఏర్పడుతుందన్నారు.

ప్రకాశం జిల్లాలో ఇంజక్షన్ వెల్స్తో సత్ఫలితాలు సాధిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. 525 గ్రామాల్లో ఇంజక్షన్ వెల్స్ భారీగా పెట్టాలన్నారు. బావుల రీఛార్జింగ్పై అందరూ దృష్టి పెట్టాలన్నారు. వరదనీరు ఇంజక్షన్ వెల్స్కు, పంటకుంటలకు చేరేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.

Related Posts