న్యూఢిల్లీ, జూలై 20,
మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇంటర్ వినియోగం భారీగా పెరుగుతోన్న భారత్‌లాంటి దేశాల్లో ఈ నేరాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గడిచిన మూడేళ్లలో భారత్‌లో ఏకంగా 36.29 లక్షల సైబర్ సెక్యూరిటీ ఘటనలు నమోదయ్యాంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. లోక్‌సభలో అడిగిన ఓ అప్రశ్నలకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అందించిన నివేదిక ప్రకారం.. 2019లో 3,94,499 కేసులు, 2020లో 11,58,208, 2021లో 14,02,809, 2022లో ఇప్పటివరకు 6,74,021 కేసులు నమోదైనట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపడుతోందన్న మంత్రి.. సైబర్ భద్రతా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు, సైబర్ దాడులను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా యూజర్లకు సలహాలు ఇవ్వడం, సైబర్ మోసాలకు సంబంధించి తగిన హెచ్చరికలను ముందుగానే రూపొందించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి వివరించారు