హైదరాబాద్ జూలై 20,
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా ప్రధానిపై వ్యంగాస్త్రాలు సంధించారు. ద్రవ్యోల్భవణాన్ని నియంత్రిచలేని ప్రధానిని మీరేమంటారని ప్రశ్నించారు. అంతే కాకుండా దేశంలో చొరబాటును నియంత్రించలేక పోతున్న ఇలాంటి ప్రధానిని మీరేమని పిలుస్తారని నాలుగు ఆప్షన్లను కేటీఆర్ ట్వీటర్ వేదిగా ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని, శాటిలైట్ ఫోటోలతో సహా మీడియా ప్రచురించిన కథనాలను కేటీఆర్ ట్వీట్ చేసారు.అయితే.. 2021లొ చైనా మరోసారి బరి తెగించిందని. విస్తరణవాదంతో చెలరేగుతున్న డ్రాగన్ దేశం.. మన భూభాగంలో ఓ గ్రామం నిర్మించిందని అప్పట్లో సంచలన కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ వార్త అప్పట్లో వైరల్ అయింది. అరుణాచల్‌ప్రదేశ్ వద్ద సరిహద్దుకు 4.5 కిలోమీటర్ల లోపల భారత్ భూభాగంలో ఈ నిర్మాణాలు చేపట్టినట్టు శాటిలైట్ చిత్రాల ఆధారంగా కథనాన్ని రాసింది. అయితే.. అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సుబన్ సిరి జిల్లాలో గల వివాదాస్పద ప్రాంతంలో చైనా బలగాలు ఏకంగా 101 ఇళ్లు నిర్మించినట్టు ఆధారాలతో ఓ మీడియా ప్రచురించన విషయం తెలిసిందే. భారత్ భూభాగమైన ఈ ప్రాంతాన్ని చైనా అనేక మార్లు తమకు చెందినదేనంటూ ప్రకటించింది. గతంలో ఇక్కడ పలు మార్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చైనా ఈ గ్రామం నిర్మించినట్టు శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు తెలిపిన విషయం తెలిసిందే.