YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లంక గ్రామాల్లో ఆకలి కేకలు

లంక గ్రామాల్లో ఆకలి కేకలు

రాజమండ్రి జూలై 20,
గోదావరి నది వరద ఉధృతి క్రమేపి తగ్గుముఖం పట్టింది. అయితే కోనసీమ జిల్లాలోని అనేక లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. పి. గన్నవరం, (P Gannavaram) రాజోలు, అంతర్వేది, మామిడికుదురు, సఖినేటిపల్లి, మల్కిపురం తదితర ప్రాంతాల్లోని పలు గ్రామాలు ఇంకా వరద ముంపులోనే చిక్కుకుని ఉన్నాయి. దీంత వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి తాగు నీరు లేక వరదబాధితులు ఆకలికేకలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో  పీ.గన్నవరం మండలంలోని నాగులంక గుట్టాయిలంక వద్ద వరద బాధితులు. తమకు ఆహార పొట్లాలు అందలేదని రాస్తారోకో చేశారు. వరద బాధితులకు ఆహారం విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు మధ్య వివాదం చోటు చేసుకుంది. వరద బాధితులకు భోజనాల విషయంలో నాగుల్లంక సర్పంచ్ యల్లమిల్లి క్రిష్ణ వేణి భర్త యల్లమిల్లి చిట్టిబాబు .. తనపై వైసిపి నాయకుడు దాడి చేసాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నాగుల్లంక ప్రజలు . రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు డౌన్ డౌన్ అంటూ బాధితులు నినాదాలు చేశారు. తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయడం మానేసి.. పోలీసులు వరద బాధితులకు సహాయం అందజేస్తున్న తమపై కేసు పెట్టడానికి వెళ్లారని సర్పంచ్ భర్త చిట్టి బాబు తమ ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు రాజోలు దీవిలోని అనేక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే చిక్కుకున్నాయి. అనేక గ్రామాల్లో వరద ఉధృతి కొనసాగుతుండడంతో.. లంక గ్రామస్థులు ఇంకా పడవలు పైనే ప్రయాణం సాగిస్తున్నారు. అప్పనపల్లిలో వరద కొనసాగుతుంది. అయితే పంచాయతీవారు తమకు పెడుతున్న భోజనం తినలేక పోతున్నామంటూ.. వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు..పంచాయతి సిబ్బంది పంపిన భోజనం తిన లేక మెత్తబడిపోయిన అన్నాన్ని గ్రామస్థులు కుక్కలకు పెడుతున్నారు.

Related Posts