విజయవాడ, జూలై 21,
ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఇది పాత లెక్క. ఒకే దెబ్బకు అనేక పిట్టలు.. ఇది అధికారపార్టీ తాజా వ్యూహం. పట్టభద్రుల MLC అభ్యర్థుల ఎంపిక ద్వారా రియల్ పొలిటికల్ గేమ్‌కు వైసీపీ సంకేతాలురియల్ పొలిటికల్ గేమ్‌కు వైసీపీ సంకేతాలు ఇచ్చిందా? ఎమ్మెల్యేలకు ఇది సెమీఫైనల్స్ అనే చర్చ సాగుతోందా? అధికారపార్టీ ఆలోచనలేంటి? లెట్స్ వాచ్..!అధికార వైసీపీ రాజకీయ చతురతకు మరింత పదును పెట్టింది. తొలిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులోకి అడుగుపెట్టి.. అభ్యర్ధులను ప్రకటించింది. ఉత్తరాంధ్ర నుంచి ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌ను ఎంపిక చేసింది. తద్వారా బహుముఖ ప్రయోజనాలను అధికారపార్టీ లక్ష్యంగా పెట్టుకుందనే చర్చ ప్రారంభమైంది. వాస్తవానికి సీతంరాజు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. హైకమాండ్ అవకాశం కల్పిస్తుందనే ధీమాతో సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో తరచూ అక్కడ కుమ్ములాటలు బయట పడుతున్నాయి.ఇప్పుడు సీతంరాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో .. అధినేత ఆలోచనల్లో భాగంగానే ఆ నిర్ణయం జరిగిందని టాక్. అంతేకాదు ఎమ్మెల్సీని గెలిపించుకునే బాధ్యత తాము తీసుకున్నామనే సంకేతాలను పార్టీ పంపించిందని సీతంరాజు వర్గం చర్చించుకుంటోంది. సాధారణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భం లేదు. ఈసారి పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తొలిసారి వైసీపీ పోటీ చేస్తోంది. అనేక సమీకరణాలను వడపోసిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకే ఇస్తున్నారనే అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంలా కనిపిస్తోంది.ఉత్తరాంధ్ర సీటును బ్రాహ్మణ సామాజికవర్గానికి కేటాయించడం ద్వారా ఉభయ తారకమైన ఆలోచన చేసిందనే చర్చ నడుస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ. విద్యావంతులు, ఉద్యోగులు అధికశాతం ఉంటారు. వీరిలో మెజార్టీ ఓటర్లు వివిధ కారణాలతో బీజేపీ, టీడీపీకి దగ్గరగా ఉంటారనే అభిప్రాయం ఉంది. అలాంటి సెగ్మెంట్‌ను ఆకర్షించడం ద్వారా మరింత బలోపేతం కావాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బ్రాహ్మణులకు ప్రాధాన్యం లేదనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. వీటన్నింటినీ ఒకేసారి పరిష్కారించేందుకే సీతంరాజును ఎంపిక చేసినట్టు విశ్లేషిస్తున్నారు.2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30మంది బరిలో ఉంటే.. పోటీ ప్రధాన అభ్యర్ధుల మధ్యే సాగింది. పీడీఎఫ్ కూటమి తరఫున అజశర్మ.. బీజేపీ, టీడీపీ అభ్యర్ధిగా పీవీఎన్ మాధవ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాధవ్ గెలిచారు. ఇప్పుడు బీజేపీకి జనసేనతో మాత్రమే పొత్తు ఉంది. ఈ రెండు పార్టీల బలం ఎంత వరకు నెగ్గుకొస్తుందనేది ఒక ప్రశ్న. టీడీపీ వైఖరి వెల్లడి కావాల్సి ఉంది. పోటీకి ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు చర్చలు జరుపుతున్నారట. వైసీపీ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. అభ్యర్ధులను ప్రకటించడం ద్వారా తన వైఖరిని స్పష్టంగా చెప్పేసింది అధిష్ఠానం. పైగా ఎమ్మెల్యేలకు పెద్ద టాస్క్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావించి ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగక తప్పదు.నిరుద్యోగ సమస్యను డీల్ చేయడం.. ఓటర్లను ఎక్కువగా నమోదు చేయించడం ఎమ్మెల్యేలకు పెద్ద టాస్కే. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకుని హైకమాండ్ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యేలదే. ఈ దిశగా వైసీపీ శాసనసభ్యులు పెద్ద కసరత్తు చేయాల్సిందే. అందుకే ఈ ఎన్నికలు బరిలో ఉండే అభ్యర్థుల కంటే ఎమ్మెల్యేలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నారట. మరి.. ఈ సమస్యను వారెలా అధిగమిస్తారో.. ప్రత్యర్థులపై ఎలా పైచెయ్యి సాధిస్తారో చూడాలి.