YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొనసీమ కొబ్బరికి తీరని నష్టం

కొనసీమ కొబ్బరికి తీరని నష్టం

కాకినాడ, జూలై 21,
పల్లెలంటేనే ఓ అందం. అందులో ఆంధ్రాలో కోన‌సీమ మ‌రీ అందం. ఈ ఊరూ .. ఈ గాలి.. సెల‌యేరూ.. అంటూ తెలుగు వాళ్లు నేల‌కు ఓ అడుగు ఎత్తునే ఆనందంలో తేలియాడుతారు.. హిందీవాళ్ల‌యితే గోరీ తేరా గావ్ బ‌డా ప్యారా.. మైతో గ‌యా హారా ఆకే య‌హారే..! అంటూ ఓల‌లాడ‌తారు. కోన‌సీమ అన‌గానే ముం దుగా వ‌చ్చే మాట కొబ్బ‌రిముక్క‌, కొబ్బ‌రి నీళ్లు... ఎవ‌ర్ని క‌దిలించినా.. కొబ్బ‌రి నీళ్ల మ‌గిమ‌.. మ‌రి.. అంటా రు.  అస‌లు కోన‌సీమంటే మరో కేర‌ళ‌తో స‌మానం. అదంతెహె! అని కాస్తంత  ఆనందం పెల్లు బికిన  గ‌ర్వంతో కూడిన ప్రేమ‌తో ప‌ల‌క‌రించ‌డం స‌దా ఆక‌ట్టుకుంటుంది.  ప్ర‌కృతి అందాలు అంటే ఛండాలంగా  అస‌హ్య‌మైన ఫ్రేముల్లో ఇళ్ల‌లో పెట్టుకునే పెయింటింగ్ బొమ్మ‌లు కాదు.  ప్ర‌తీ ప్రాంతానికి ఓ ప్ర‌త్యేక‌త ఉన్న‌ట్టే కోన‌సీమ ప్ర‌త్యేక‌త కొబ్బ‌రి అన్నాం గ‌దా. కానీ ఇటీవ‌లి ప్ర‌కృతి వైప రీత్యాల‌తో కొబ్బ‌రి రైతు విల‌విల‌లాడుతున్నాడు. వరద రూపం లో  గోదావరి  విలయ తాండవానికి వరద ప్రభావిత ప్రాంత ప్రజలు ఒక పక్క ఆకలి కేకలు,మరో పక్క సహాయక చర్యలు అందక ఇబ్బందులు పడు తుంటే,మరో పక్క కొబ్బరి చెట్లు నీట మునిగి కాపు రాక  రైతులు రోదిస్తున్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు, పాశర్ల పూడి గ్రామాలలో పాటు మరి కొన్ని చోట్ల కొబ్బరి రైతులు వరద నష్టం పై ఆందోళన చెందుతున్నారు. ఈ జులై కోన‌సీమ అందాన్ని చింద‌ర‌వంద‌ర చేసింది. ముఖ్యంగా వరదల వల్ల  కొబ్బ‌రి నేల రాలి పోవడంతో  కోట్లలో నష్టం వచిందని వ్యాపారాలు గోల పెడుతున్నారు. కొబ్బరి కాయలు పూర్తిగా తడిసి పోయాయని, తొమ్మిది రూపాయలు పలికే ది  కనీసం రెండు రూపాయలు పలకడం లేదని వాపోతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  జూలై నెలలో వరదలు వచ్చాయి అని, దాని వల్ల చాలా నష్టపోయాం అని చెప్తున్నారు.వరద నీటి లో తడిసి కొబ్బరి కాయలు కుళ్ళిపోయి ఎందుకూ పనికి రాకుండా పోయాయని కన్నీరు పెట్టుకుంటున్నా రు. కోనసీమ నుంచి దేశం నలుమూలలకి  కొబ్బరి ఎగుమతులు వున్నాయి.అలాంటి కొబ్బరి కాయలు కుళ్ళి ఎగుమతికి పనికి రాకుండా పోయింది అని రోదిస్తున్నారు. ప్రభుత్వం తగిన సహాయం చేయాలనీ రైతులు అభ్య‌ర్ధిస్తున్నారు.  లంక గ్రామాలలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. లంక గ్రామాల్లో వరదలు తీవ్ర నష్టా న్ని మిగిల్చాయి. వరద ముంచెత్తడంతో  పంటలన్నీ నాశనమయ్యాయి. రైతులు దిక్కుతోచని  స్థితిలో పడ్డారు. లంక గ్రామల్లో దాదాపు వేల ఎకారాల్లో పంట నీటిలో మునిగిపోయింది. ఈ  వరదల  కారణంగా  కోట్ల రూపా యిల్లో నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవా లని కోరుతున్నారు.

Related Posts