శ్రీకాకుళం, జూలై 21,
యుద్ధానికి వ్యూహాలు ఉంటాయి, ఎన్నికల్లో గెలవడానికి ఎత్తుగడలూ ఉంటాయి. కానీ అరాచకాన్ని ఆయు ధంగా చేసుకుని గెలిస్తే అది విజయమని ఎలా అంటారు. భయపెట్టి, మభ్యపెట్టి దండోపాయాన్నే అమలు చేసి ఎలాంటి ఎన్నికయినా గెలిచేయాలన్న తపన మహా ప్రమాదకారి. ఇది వ్యూహం అనిపించు కోదు, కుట్రతో కూడిన ఎత్తుగడ మాత్రమే. దీన్ని పూర్తిగా నమ్మి, అమలు చేసి ఎలాంటి ఎన్నికల్లోనైనా గెలవడానికి సిద్ధపడటమే వైసీపీకి తెలిసిన విద్య అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లోనూ ఎక్కడ ఓడిపోతామోనన్న భయంతో వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని, గెలవలేనేమోనన్న భీతి వారిని వెన్నాడుతోందని అచ్చెంనాయుడు ఘాటుగా విమర్శించారు. ఇలాంటి వ్యూహాలతో ఎన్నికల్లో పాల్గొనడం, ఏకపక్షంగా ఓట్లు వేయించుకోవడానికి ఇక ఎన్నికలతో పనేమి టని ఆయన ఆగ్రహించారు. టీడీపీ నేతలను గృహ నిర్భంధం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నిక లెందుకని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని దారు ణంగా హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పోలీసులున్నది అధికార పక్షానికి కొమ్ము కాయడానికా ? లేక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు, వైసీపీ నేతలను ఎందుకు అరెస్టులు చేయలేదని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా రని దుయ్యబట్టారు. దొంగ ఐడీ కార్డులు ముద్రించి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లను అడ్డుకుంటామనే టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారన్నారు. మూడేళ్లుగా దోచుకున్న డబ్బు ను అక్రమంగా గెలిచేందుకు వెదజల్లుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంబలంతో, ఈ ఎన్ని కల్లో గెలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జగన్ రెడ్డికి ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.