YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యోగికి అసమ్మతి సెగ

యోగికి అసమ్మతి సెగ

లక్నో, జూలై 21,
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు అసమ్మతి సెగ తగిలింది. ఆయన కేబినెట్ సహచరులే తిరుగుబావుటా ఎగురు వేశారు. యోగి మంత్రివర్గంలో ఇద్దరు తమ అసమ్మతిని బహిర్గతం చేశారు. యోగి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా, మరో మంత్రి పార్టీ హై కమాండ్ కు యోగి తీరుపై ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా పలు  రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీకి చోట్ల   అసమ్మతి ఆనవాళ్లు కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా, ఎవరూ ఇలా బహిర్గతం కాలేదు.  బీజేపీ సీఎంలందరిలోనూ అత్యంత శక్తిమంతుడిగా భావించే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైనే తిరుగుబావుటా ఎగురవేయడం యోగి తీరును విమర్శిస్తూ ఏకంగా ఒక మంత్రి రాజీనామా చేయడం సంచలనం కలిగించింది.   ఉత్తర ప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దినేశ్   మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను దళితుడిని కావడం వల్లే సీఎం తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, వివక్ష చూపుతూ ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ దినేశ్ విమర్శించారు. దినేశ్ తన రాజీనామా లేఖను ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షాకు పంపారు.  చూపుతున్నారని, ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. దినేశ్ తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పంపారు.దళితుడిని కనుకనే తన పట్ల వివక్ష చూపుతున్నారనీ, మంత్రిగా తనకు ఎటువంటి అధికారాలూ లేవనీ, గత వంద రోజులుగా తనకు ఎటువంటి పనీ అప్పగించలేదనీ, కనీసం అధికారిక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం లేదనీ ఆయనా లేఖలో పేర్కొన్నారు. అలాగే యోగి కేబినెట్ లో మరో మంత్రి కూడా తన అసమ్మతిని బహిర్గతం చేశారు. ముఖ్యమంత్రి యోగి తీరుపై నేరుగా పార్టీ అధిష్ఠానానికే ఫిర్యాదు చేశారు.  అవినీతి ఆరోపణలపై యూపీ సర్కార్ ఇటీవల సస్పెండ్ చేసిన అధికారులలో రాష్ట్ర్ర ప్రజాపనుల శాఖ మంత్రి జితిన ప్రసాద పీఏ కూడా ఉన్నారు. దాంతో సీఎం యోగి జితిన ప్రసాదను మందలించారనీ, దీంతో  ఆయన తీవ్ర ఆగ్ర్హహం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జితిన ప్రసాద ఫిర్యాదు చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. యోగి తీరు నియంతలా ఉందని, మంత్రులకు, ఎమ్మెల్యేలకూ కనీస గౌరవం దక్కడం లేదనీ జితిన ఆరోపిస్తున్నారు.

Related Posts