YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేంద్ర, రాష్ట్రం మధ్య బియ్యం లొల్లి

కేంద్ర, రాష్ట్రం మధ్య బియ్యం లొల్లి

విజయవాడ, జూలై 22,
వైసీపీ, బీజేపీ సయోధ్యకు ఫుల్ స్టాప్ పడింది. అందుకు తార్కాణాలు ఒక్కటొక్కటిగా  బయటపడుతున్నాయి. నిన్న కాక మొన్న అఖిల పక్షంలో ఏపీ అప్పులను వేలెత్తి చూపిన కేంద్రం ఇప్పుడు కేంద్రం అందిచే ఉచిత బియ్యం పంపిణీ ఏపీలో నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ ఉచిత బియ్యం పంపిణీ గత నాలుగు నెలలుగా నిలిచిపోయినా ఇప్పటి వరకూ కిమ్మనని కేంద్రం.. రాష్ట్ర పతి ఎన్నిక ముచ్చట ముగియగానే వైసీపీ సర్కార్ పై బియ్యం పంపిణీ నిలిపివేతపై సీరియస్ అయ్యింది.బియ్యం లేవన్న సాకుతో ఏపీ సర్కార్  ఏప్రిల్, మే, జూన్ నెలలలో ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేసింది. ఇప్పుడు జూలై నెలలో కూడా పరిస్థితి అదే. ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేతపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ఇంత కాలం కిమ్మనకుండా ఊరుకున్న కేంద్రం ఇప్పుడు మాత్రం సీరియస్ గా తీసుకుంది. మరో వైపు ఏపీ బీజేపీ నాయకులు కూడా స్వరం పెంచి విమర్శల తీవ్రతను పెంచారు. అక్కడితో ఊరుకోకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. కేంద్రం పేదల కోసం ఉచితంగా బియ్యం అందిస్తుంటే.. ఆ పేదల బియ్యాన్ని కూడా వైసీపీ సర్కార్ బొక్కేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు చేస్తున్న విమర్శలపై జగన్ సర్కార్ స్పందించడం లేదు.కానీ పేదల బియ్యాన్ని వైసీపీ సర్కార్ నొక్కేస్తోందన్న విమర్శల వల్ల ప్రజా వ్యతిరేకత మరింత ఎక్కువ అవుతుందన్న ఆందోళన మాత్రం వైసీపీ వర్గాలలో వ్యక్తమౌతోంది. అసలు సంగతి ఏమిటంటే కోవిడ్ తో నష్ట పోయిన ప్రజలకు కొంత ఊరట కలిగించే ఉద్దేశంతో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కంద  ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. 2022 మార్చితో ఉచిత పంపిణీ పథకం ముగిసినప్పటికీ దానికి కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. అంటే ఈ ఏడాది అక్టోబర్ వరకూ ఈ పథకం కొనసాగుతుంది.అయితే  ఏపీలో మాత్రం ఉచిత బియ్యం పంపిణీ పథకం ఏప్రిల్ నుంచే నిలిచిపోయింది. వాస్తవానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికీ 5 కిలోల చొప్పున ఈ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి ఇందుకకోసం బియ్యం సకాలంలో ఎలాంటి జాప్యం లేకుండా రాష్ట్రానికి చేరుతోంది. అయితే జగన్ సర్కార్ మాత్రం గత నాలుగు లెలలుగా బియ్యం నిల్వలు లేవనో.. సాంకేతిక సమస్యలనో సాకులుగా చూపుతూ బియ్యం పంపిణీకి తిలోదకాలిచ్చేసింది.  దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సవ్యంగా ఉచిత బియ్యం పథకం అమలులో ఉన్నా, ఏపీలో మాత్రం మొండి చేయి చూపుతుండడం పట్ల   కేంద్రం సీరియస్ అయ్యింది.ఉచిత బియ్యం పేదలకు అందించకుంటే రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణతో పాటు బియ్యం పంపిణీని సైతం నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో అధికార వైసీపీని ఇరుకున పెట్టే విధంగా   బీజేపీ   రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పేదల బియ్యాన్ని నొక్కేస్తున్నారని నినాదంతో నిరసన కార్యక్రమాలకు తెరలేపింది. ప్రధాని మోదీ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉచిత బియ్యం అందిస్తుంటే జగన్ సర్కారు అడ్డుకుంటోందని    ఇలా ఉండగా కేంద్ర  ఉచిత బియ్యం పంపీణీని నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో అందించి ఇక్కడ మాత్రం మొండిచేయి చూపడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. అటు లబ్దిదారులు సైతం ప్రభుత్వం తీరును గర్హిస్తున్నారు.

Related Posts