YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టీచర్ నుంచి రాష్ట్రపతి దాకా

టీచర్ నుంచి రాష్ట్రపతి దాకా

న్యూఢిల్లీ జూలై 22,
అందరూ అనుకున్నట్టుగానే ద్రౌపది ముర్ము  గెలుపు లాంఛన ప్రాయమైంది. దేశ అత్యున్నత పదవి చేపడుతున్న తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు. ఆమెకు మొత్తం 5,77,777 ఓట్లు పోలయ్యాయి. ఆమెకు 68.87 శాతం ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 31.1 శాతం ఓట్లు వచ్చాయి. ఈ మేరకు యశ్వంత్ సిన్హా ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ద్రౌపది ముర్ము సాధారణ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు.ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని రాయరంగపూర్‌కు చెందిన గిరిజన నాయకురాలు. ద్రౌపది ముర్ము మృధు స్వభావి. ఆమె తన కఠోర శ్రమతో ఒడిశా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము అత్యున్నత రాష్ట్రపది పదవిని చేపట్టిన మొదటి గిరిజన మహిళ. ద్రౌపది ముర్ము జూన్ 20, 1958న మయూర్‌భంజ్ జిల్లాలోని ఉపర్బెడ గ్రామంలో సంతాలీ గిరిజన కుటుంబంలో జన్మించారు.ద్రౌపది ముర్ము 2014లో శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అయితే వారిద్దరూ మరణించారు. ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఇతశ్రీ ముర్ము.. ద్రౌపది ముర్ము భర్త కూడా మరణించారు. రాష్ట్ర రాజకీయాల్లోకి రాకముందు ద్రౌపది ముర్ము పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ముర్ము అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ఒడిశా ప్రభుత్వ నీటిపారుదల విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు.ద్రౌపది ముర్ము 1997లో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాయరంగ్‌పూర్ నగర్ పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2000లో ఆమె రాయంగ్‌పూర్ నగర్ పంచాయతీకి చైర్‌పర్సన్‌గా.. బీజేపీ షెడ్యూల్డ్ తెగల మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఒడిశాలో బీజేపీ, బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ద్రౌపది ముర్ము క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఎమ్మెల్యేగా, పలు శాఖలకు మంత్రిగా కూడా ద్రౌపది ముర్ము పనిచేశారు.ద్రౌపది ముర్ము రాజకీయ ప్రస్థానంలో మరో కీలక పదవిని కూడా చేపట్టారు. మే 18, 2015న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితలయ్యారు. జార్ఖండ్‌కు మొదటి మహిళా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒడిశా నుంచి భారత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన మొదటి మహిళా గిరిజన నాయకురాలు ఆమె. ఆమె గవర్నర్‌గా ఉన్నప్పుడు గిరిజనులకు తమ భూమిని వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు హక్కులు కల్పించాలని, అదే సమయంలో భూమిపై యాజమాన్యం మారకుండా చూసేందుకు బిల్లును కోరారు.ద్రౌపది ముర్మును 2022 భారత రాష్ట్రపతికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థిగా BJP నామినేట్ చేసింది. ఆమె అభ్యర్థిత్వానికి బీజేపీ శాసన సభ్యులు, ఇతర ప్రతిపక్షాల నుంచి మద్దతు కోరుతూ దేశవ్యాప్తంగా ప్రచారం కూడా చేశారు.

Related Posts