విశాఖపట్నం
కార్గిల్ విజయ దివాస్ను పురస్కరిం చుకొని కార్గిల్ అమరవీరులకు నేవీ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు నివాళులర్పించారు. నేవీ ఆధ్వర్యం లో ఆర్కే బీచ్ రోడ్ వార్ మెమోరియల్ వద్ద కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు.
1999 జులై 26న తొలి కార్గిల్ విజయ్ దినోత్సవం జరిగింది. అప్పటి నుంచీ ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.ఈ విజయం వెనుక ఎంతో మంది సైనికుల ప్రాణ త్యాగం ఉంది. తమ ప్రాణాలను అడ్డుపెట్టి మన దేశాన్ని రక్షించడమే కాదు.. పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్ వక్ర బుద్ధిపై దెబ్బ కొట్టి సైనికుల సత్తా చాటారు. పాకిస్థాన్ వక్రబుద్ధిని భారత వీరులు విజయవంతంగా తిప్పి కొట్టారు. దాయాది దేశం పాకిస్తాన్ కన్ను ఎప్పుడూ భారత్ పైనే.. ముఖ్యంగా కశ్మీర్ పైనే ఉంటుంది. ఏదో ఒక వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా చేసింది.అందుకు ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ చేతు లు కలిపింది. సహాజ నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి మన ఆర్మీపై దాడికి తెగబడింది. ఇండియన్ ఆర్మీ ధీటుగా స్పందించింది. ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్కు బుద్ధి చెప్పింది.ఈ నేపథ్యంలో పలువురు నేవి సిబ్బంది వీరమరణం పొందారు.కార్గిల్ విజయ దినోత్సవాన్ని ప్రతీ ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ప్రజలు సైతం సైనికుల త్యాగాలకు గుర్తుగా క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది.దింట్లో భాగంగా విశాఖలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున్,తో పాటు అధికారులు ఘనంగా నివాళి అర్పించారు.