తిరుపతి, ఆగస్టు 29,
మరి కావాలని చేస్తున్నారో లేక…కట్టడి చేద్దామని చేస్తున్నారో తెలియదు గాని…రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు దూకుడు మరింత ఎక్కువగా ఉంటుంది…ఎక్కడకక్కడ టీడీపీని నిలువరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడైనా వెళ్ళే హక్కు ఉంది…నిషేదిత ప్రాంతాలు తప్ప…మరి ఏపీలో అలాంటి నిషేధిత ప్రాంతాలు లేవు. అయినా సరే టీడీపీ నేతలు ఏదైనా కార్యక్రమం చేపడతే…మొదట పోలీసులే వాటిని ఆపే కార్యక్రమం చేస్తున్నారు.టీడీపీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే మొదట టీడీపీ నేతలని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేస్తున్నారు. అలాగే తమ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగినా, ఏదైనా అన్యాయం జరిగినా వారిని పరామర్శించడానికి చంద్రబాబు లేదా లోకేష్ వెళుతున్నారు. కానీ వారిని సైతం పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఇదే తీరు. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, జగన్‌ని ఇలాగే అడ్డుకున్నారు. కాకపోతే మరీ ఈ స్థాయిలో కాదు.ఇక చంద్రబాబు ఏదైనా కార్యక్రమం చేస్తే పోటీగా వైసీపీ కూడా కార్యక్రమాలు చేస్తుంది. తాజాగా బాబు కుప్పం టూరుకు వెళ్లారు. ఒక ప్రతిపక్ష నేతగా, స్థానిక ఎమ్మెల్యేగా కుప్పంలో బాబు పర్యటించారు. కానీ బాబు పర్యటన అప్పుడే వైసీపీ శ్రేణులు పోటీగా కార్యక్రమం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా బాబు పర్యటన ఉన్నప్పుడే…వైసీపీ శ్రేణులకు ర్యాలీ చేయడానికి పర్మిషన్ వచ్చింది.దీంతో మరొకసారి రచ్చ జరిగింది. మామూలుగా బాబు కుప్పం వచ్చి…తన పని తాను చూసుకునే వెళ్లిపోతారు. కానీ మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల పెద్ద రచ్చ అవుతుంది. ఈ రచ్చ క్రియేట్ అవ్వడానికి మెయిన్ కారణం వైసీపీ అవుతుంది. అయితే టీడీపీ ఇదంతా చేస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు…కానీ ప్రజలకు అసలు విషయం అర్ధమవుతుంది. కాబట్టి వైసీపీ చేసే పనులు పరోక్షంగా చంద్రబాబుకు మేలు చేసేలా ఉన్నాయి. ఏదో బాబుని అడ్డుకుంటున్నామని అనుకుంటున్నారు గాని…పరోక్షంగా ఆయన గ్రాఫ్ పెంచేస్తున్నారు